సమంత శరీరంపై ఆ టాటూ మిస్సింగ్‌.. ‘చై’ని చెరిపేసిందా? | Is Samantha Removes Tattoo Of Naga Chaitanya Name On Her Rib, Pics Goes Viral Amid Reunite Rumours - Sakshi
Sakshi News home page

Samantha Rib Tattoo Controversy: సమంత శరీరంపై ఆ టాటూ మిస్సింగ్‌.. ‘చై’ని చెరిపేసిందా?

Published Thu, Oct 12 2023 11:10 AM | Last Updated on Thu, Oct 12 2023 11:33 AM

Samantha Removes Tattoo of Naga Chaitanya Name, Pics Goes Viral - Sakshi

సమంత- నాగ చైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ లిస్ట్‌లో ముందు వరుసలో ఉండేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు. విడాకులు తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. అయినా కూడా వీరిద్దరి పర్సనల్‌ లైఫ్‌కు సంబధించి ఇప్పటికీ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. వీటిని అటు నాగచైతన్య కానీ ఇటు సమంత పెద్దగా పట్టించుకోకుండా తమ తమ పనుల్లో బీజీ అవుతున్నారు.

ప్రస్తుతం సామ్‌​ దుబాయ్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిన సమంత.. కొన్నాళ్ల పాటు విహారయాత్రల చేయాలని డిసైడ్‌ అయ్యారట. అందుకే మొన్నటి వరకు అమెరికా పర్యటనకు వెళ్లి..ఇప్పుడు దుబాయ్‌ అందాలను వీక్షించేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో సామ్‌కు సంబంధించిన ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన మాజీ భర్త నాగ చైతన్య కోసం వేయించుకున్న పచ్చబొట్టును సామ్‌ తొలగించుకున్నారనేది ఆ వార్త సారంశం. 

ప్రేమకు గుర్తుగా టాటూ
సమంత-నాగ చైతన్యలది ప్రేమ వివాహం అని అందరికి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చై ప్రేమకు గుర్తుగా సమంత తన శరీరంపై మూడు టాటూలను వేయించుకుంది. అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడో టాటూ నడుముపై వేయించుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఈ టాటూల విషయం చర్చనీయాంశంగా మారింది. సామ్‌ టాటూలు తొలగిస్తుందా లేదా? అనే చర్చ నెట్టింట జోరుగా జరిగింది. 

‘చై’టాటూ తొలగించిందా?
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన శరీరంపై టాటూలను అలానే ఉంచుకుంది. అప్పట్లో సామ్‌ చేసిన ఫోటో షూట్స్‌లో నడుము ఉన్న టాటూ చర్చనీయాంశంగా మారింది. భర్తకు దూరమైనా.. అతని ముద్దు పేరు మాత్రం వదిలించుకోవడం లేదనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సామ్‌ పింక్‌ సారీలో ఫోటోషూట్‌ నిర్వహించింది. ఆ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలను పరీశీలిస్తే..నడుముపై ‘చై’టాటూ మిస్‌ అయింది. దీంతో సామ్‌ ఆ టాటూని తొలగింకున్నారని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. టాటుని తొలగించుకోవడం కష్టమని, మేకప్‌ వేసి కవర్‌ చేశారని మరికొందరు అంటున్నారు. చై-సామ్‌ మళ్లీ కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘చై’ టాటూ కనిపించకపోవడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement