
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువతకు టాటులంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిపైన ఎక్కడొ ఒక చోట టాటు లేకుండా మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరూ మంచి టాటు వేయించుకోవాలనే అనుకుంటారు. అదేవిధంగా ఆర్టిస్టు కూడా తన కస్టమర్‌కి మంచి టాటును ఇచ్చి తన నైపుణ్యన్ని ప్రదర్శించడం కోసం ఆరాటపడటం సహజం. కానీ ఇక్కడ ఒక టాటో ఆర్టిస్ట్ తన సృజనాత్మకతను మరోస్థాయికి తీసుకువెళ్లాడు.
(చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’)
అతను చిత్రించిన 76 టాటులతో కదిలే టాటులకు సంబంధించిన అద్భుతమైన వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ ఫిల్ బెర్జ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 76 టాటూల గురించి వివరిస్తూ..ఒక క్యాప్షన్‌ని జోడించి పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నెటిజన్లు కళాకారుల సృజనాత్మకతను అందుకోలేం, అమేజింగ్ వీడియో అంటూ రకరకాలుగా టాటు ఆర్టిస్ట్‌ని ప్రశంసిస్తూ ట్విట్ చేస్తున్నారు.
(చదవండి: షారుక్ ప్రకటనలు నిలిపేసిన ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్)
Comments
Please login to add a commentAdd a comment