సాక్షి,ముంబై: టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్టు అంటూ ఒక వీడియో ఇంటర్నెట్‌లో ఆకర్షణీయంగా నిలుస్తోంది. నూర్జహాన్ అనే యువతి స్పెషల్‌గా రూపొందించిన వీడియోపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. అద్బుత కళాకారిణి, అద్భుతమైన వీడియో అంటూ మంత్ర ముగ్ధులై పోయారు. ఒకేసారి 15 పోర్ట్రెయిట్‌లను చిత్రించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆమె గ్రేట్ ఆర్టిస్ట్.. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశార. అంతేకాదు ఈ ఫీట్ నిజంగా వాస్తవమైతే ఆమెను కచ్చితంగా ప్రోత్సహించాలి. వివరాలను అందిస్తే సంతోషిస్తాను అంటూ నెటిజనులను కోరారు. తద్వారా ఆమెకు స్కాలర్‌షిప్ , ఇతర రకాలుగా తన సపోర్ట్ అందిస్తానంటూ ట్వీట్ చేశారు.
చదవండి: చీఫ్ ట్విట్ అట! సింక్‌తో హింట్! మస్క్ వీడియో వైరల్, పేలుతున్న సెటైర్లు
కాగా పలువురు దేశభక్తి నాయకులు, వీరుల చిత్రాలను ఒకేసారి, వివిధ స్ట్రోక్‌లతో అత్యద్బుతంగా చిత్రించిన వైనం పలువురి ప్రశంసలందు కుంటోంది. ఒక చేత్తో ఒకేసారి 15 ఆర్ట్స్.. వరల్డ్ రికార్డ్ అంటూ నూర్జహాన్ యూ ట్యూబ్‌లో ఈ విడియోను షేర్ చేశారు. అయితే చాలామంది ఆర్టిస్టులు దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి కళను తామెప్పుడూ చూలేదు. పెన్నుల స్థానాలను మార్చకుండా అలా ఎలా గీస్తున్నారు అనే సందేహాలు మరికొంతమంది వ్యక్తం చేశారు. అమేజింగ్. రియల్లీ గుడ్ జాబ్.. అని కొందరు..ఫేక్ వీడియోలా ఉంది అంటూ మరికొందరు కమెంట్ చేయడం గమనార్హం. సాధ్యమే అంటే మరికొన్ని యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి! మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి!
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support. pic.twitter.com/5fha3TneJi
— anand mahindra (@anandmahindra) October 27, 2022
https://t.co/SBZ5U4GN8w
— Piyush Gupta (@Piyush941919) October 27, 2022
Possible.
Comments
Please login to add a commentAdd a comment