Portrait
-
ఇంటింటికీ ‘అయోధ్య’ చిత్రపటాలు
హుజూరాబాద్ రూరల్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఇంటికే అయోధ్య రామయ్య రానున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును.. ఎంపీ బండి సంజయ్‌కుమార్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల ఇళ్లకు రాములోరి చిత్రపటాలను పంపిణీ చేయనున్నారు. అయోధ్య వెళ్లలేని వారు తమ ఇళ్లల్లోనే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఓటర్లున్నారు? ఎన్ని కుటుంబాలున్నాయి? వారిలో రామయ్యను కొలిచే వాళ్లెందరున్నారు? అనే వివరాలను సేకరించారు. మొత్తం 5 లక్షల కుటుంబాలకు పైగా ఉండగా.. వాటిలో నాలుగు లక్షలకు పైగా కుటుంబాలు హిందువులని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, 4.21 లక్షల అయోధ్య రాముని చిత్రపటాలను తయారు చేయించే పనిలో ఎంపీ నిమగ్నమయ్యారు. ఇప్పటికే లక్షకు పైగా సిద్ధమవడంతో ఇంటింటికీ చేరవేసే పనిలో కాషాయ శ్రేణులు నిమగ్నమయ్యాయి. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంజయ్ మంగళవారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. -
30 అడుగుల అభిమానం
‘జవాన్’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్ బెనర్జీ మార్బుల్ స్టోన్ చిప్స్, పెయింట్ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్ పోట్రాయిన్ రూపొందించాడు. ఈ స్టన్నింగ్ పోర్ట్రయిట్ డ్రోన్ షాట్ అదిరిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్ టూ ది కింగ్‌ఖాన్. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ. -
యంగ్ ఆర్టిస్టు వీడియో వైరల్: ఆనంద్ మహీంద్ర ఆఫర్...కానీ
సాక్షి,ముంబై: టాలెంటెడ్ యంగ్ ఆర్టిస్టు అంటూ ఒక వీడియో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా నిలుస్తోంది. నూర్జహాన్ అనే యువతి స్పెషల్‌గా రూపొందించిన వీడియోపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. అద్బుత కళాకారిణి, అద్భుతమైన వీడియో అంటూ మంత్ర ముగ్ధులై పోయారు. ఒకేసారి 15 పోర్ట్రెయిట్లను చిత్రించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆమె గ్రేట్ ఆర్టిస్ట్.. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశార. అంతేకాదు ఈ ఫీట్ నిజంగా వాస్తవమైతే ఆమెను కచ్చితంగా ప్రోత్సహించాలి. వివరాలను అందిస్తే సంతోషిస్తాను అంటూ నెటిజనులను కోరారు. తద్వారా ఆమెకు స్కాలర్షిప్ , ఇతర రకాలుగా తన సపోర్ట్ అందిస్తానంటూ ట్వీట్ చేశారు. చదవండి: చీఫ్ ట్విట్ అట! సింక్‌తో హింట్! మస్క్ వీడియో వైరల్, పేలుతున్న సెటైర్లు కాగా పలువురు దేశభక్తి నాయకులు, వీరుల చిత్రాలను ఒకేసారి, వివిధ స్ట్రోక్‌లతో అత్యద్బుతంగా చిత్రించిన వైనం పలువురి ప్రశంసలందు కుంటోంది. ఒక చేత్తో ఒకేసారి 15 ఆర్ట్స్.. వరల్డ్ రికార్డ్ అంటూ నూర్జహాన్ యూ ట్యూబ్‌లో ఈ విడియోను షేర్ చేశారు. అయితే చాలామంది ఆర్టిస్టులు దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి కళను తామెప్పుడూ చూలేదు. పెన్నుల స్థానాలను మార్చకుండా అలా ఎలా గీస్తున్నారు అనే సందేహాలు మరికొంతమంది వ్యక్తం చేశారు. అమేజింగ్. రియల్లీ గుడ్ జాబ్.. అని కొందరు..ఫేక్ వీడియోలా ఉంది అంటూ మరికొందరు కమెంట్ చేయడం గమనార్హం. సాధ్యమే అంటే మరికొన్ని యూట్యూబ్ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి! మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి! How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support. pic.twitter.com/5fha3TneJi — anand mahindra (@anandmahindra) October 27, 2022 https://t.co/SBZ5U4GN8w Possible. — Piyush Gupta (@Piyush941919) October 27, 2022 -
బ్రిటన్ రాణికి గొప్ప నివాళి... ఆకాశమే హద్దుగా పోర్ట్రెయిట్‌ని రూపొందించిన పైలెట్
బ్రిటన్‌రాణి క్వీన్ ఎలిజబెత్ 2న సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బాల్మోరల్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దివగంత బ్రిటన్ రాణికి సరిగ్గా ఒక నెల తర్వాత ఆమెకు ఒక పైలెట్ అత్యంత ఘనమైన నివాళి అందించింది. అదీ కూడా విమానంతో ఆకాశంలో అతిపెద్ద క్విన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఈ మేరకు పైలెట్ అమల్ లార్లిడ్ అక్టోబర్ 6న క్వీన్ ఎలిజబెత్ పోర్ట్రెయిట్‌ని రూపొందిచిందని గ్లోబల్ ఫ్టైట్ ట్రాకింగ్ సర్వీస్ రాడార్ 24 తన ట్విట్టర్లో పేర్కొంది. ఆమె సుమారు రెంగు గంటలు దాదాపు 413 కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌కి వాయువ్యంగా 105 కి.మీ పొడవు, 63 కి.మీ వెడల్పుతో బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్‌ని రూపొందించింది. ఆమె ఫ్టైట్ జర్నీకి వెళ్లే ముందే రాడార్‌తో మాట్లాడు తాను సిద్ధం చేసుకున్న ప్లైట్ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఫోర్ఫ్లైట్ ద్వారా గుర్తించబడిన ఫార్మాట్లో విమానాన్ని పోనిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. అంతేకాదు తాను అవసానదశలో ఉన్న రోగుల సంరక్షణ కోసం పనిచేసే యూకే స్చచ్ఛంద సంస్థ కోసం డబ్బులను సేకరిస్తున్నట్లు అమల్ పేర్కొంది. ఈ బ్రిటన్ రాణి పోర్ట్రెయిట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా యూకే పేర్కొంది. Pilot @amal_larhlid wanted to pay tribute to the late Queen and raise money for @hospiceuk, so earlier today she completed the world’s largest portrait of Queen Elizabeth II. https://t.co/79BHv357dQ pic.twitter.com/CAl5Vfemr9 — Flightradar24 (@flightradar24) October 6, 2022 (చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు) -
వైట్ హౌస్‌లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు
వాషింగ్టన్: బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్‌కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. వాస్తవానికి బరాక్ ఒబామా దంపతులు 2017లో వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన తదనతరం మళ్లీ తమ అధికారిక పోర్ట్రెయిట్ల(చిత్రపటాల) ఆవిష్కరణ కోసం తొలిసారిగా వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. ఇది అమెరికా వైట్ హౌస్ సంప్రదాయ వేడుక. 2012లో చివరిగా జరుపుకున్న సంప్రదాయాన్ని మళ్లీ అందరికీ తిరిగి గుర్తు చేసేలా చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు జో బైడెన్ ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ వేడుక కోసం బరాక్ ఒబామా దంపతులకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ వేడుకలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పాల్గొన్నారు. ఈ వేడుకతో అమెరికా ప్రజలకు బరాక్ ఒబామా దంపతులు మరింత చేరవయ్యారని బైడెన్ అన్నారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో సతమతమవుతుండటంతో వైట్ హౌస్‌లో ఈవెంట్లను జరపడం కోసం చాలా కాలంగా నిరీక్షించామని జిల్ బైడెన్ అన్నారు. అంతేకాదు ఈ పవిత్రస్థలంలో వారి చిత్ర పటాలను గోడలకు వేలాడదీయడంతో అధికారంలోకి రానున్న తరాల వారికి స్ఫూర్తిగానే గాకుండా గత స్మృతులు కళ్లముందు మెదిలాడి సవాళ్లును ఎదర్కొనే ధ్యైర్యాన్ని ఇస్తాయన్నారు జిల్ బైడెన్. ఈ పోర్ట్రెయిట్ ఆవిష్కరణ సంప్రదాయం 1965 నుంచి అసోసియేషన్ చేపట్టింది. తొలిసారిగా ఈ పోర్ట్రెయిట్లను చిత్రించిన కళాకారుల పేర్లును కూడా వెల్లడించారు. ఒబామా చిత్రపటాన్ని రాబర్ట్ మెక్కర్డీ, మిచెల్ ఒబామా చిత్రపటాన్ని షారన్ స్ప్రంగ్ చిత్రించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. జో బిడెన్ అధ్యక్షుడిగా ఉండటం అమెరికా అదృష్టమని ప్రశంసించారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్‌గా బైడెన్ తనకు ఎన్నో సలహాలు, సూచలను అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో విపత్కర సమయాల్లో బైడెన్ తనకు చక్కటి మార్గ నిర్దేశం చేశారని అన్నారు. అలాగే ఈ చిత్రపటాలను చిత్రించిన కళాకారులను సైతం మెచ్చుకోవడమే కాకుండా వారి పనితీరుని కూడా ఎంతగానో ప్రశంసించారు. తన దృష్టిలో ఈ పోర్ట్రెయిట్లకు మరింత ప్రాముఖ్యత ఉందని, అవి జార్ట్, మార్తా, వంటి నాటి మహోన్నత అధ్యక్షుల చిత్రాల సమక్షంలో తమ చిత్రాలు ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాని ఒబామా చెప్పారు. I want to thank Robert McCurdy for his extraordinary work on my portrait. Robert is known for his paintings of public figures, and I love how he paints people exactly the way they are. Take a look at the process behind creating the official White House portraits: pic.twitter.com/oZb6ov4uwr — Barack Obama (@BarackObama) September 7, 2022 (చదవండి: స్వీట్ బాక్స్‌లో ఏకంగా రూ.54 లక్షలు) -
కాళ్లతో అమితాబ్ పెయింటింగ్ వేసిన అభిమాని.. నెటిజన్లు ఫిదా
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ తెలిసిందే. ఎందరో ఆయన అభిమానులు రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే దివ్యాంగుడైన ఓ వ్యక్తి వేసిన పెయింటింగ్‌కి లెజెండ్ యాక్టర్‌తోపాటు నెటిజన్ల ఫిదా అవుతున్నారు. ఆ పెయింటింగ్‌ని అమితాబ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అందులో ఆ యువకుడు ‘గులాబో సితాబో’ సినిమా నుంచి ఆయన లుక్‌ని గీశాడు. అయితే అది చేతులతో కాదు కాళ్లతో. అతని పేరు ఆయుష్ అని, చేతులు ఉపయోగించలేడు కానీ కాళ్లతో అద్భుతమైన పెయింటింగ్ వేయగల ప్రత్యేక సామర్థ్యం ఉన్నవాడని ఈ లెజెండ్ యాక్టర్ తెలిపాడు. ఆయుష్‌ని స్వయంగా కలిసిన బిగ్‌బీ, బొమ్మల్ని గీసే విధానం తెలుసుకొని, తనకు బహుమతిగా పెయింటింగ్ ఇచ్చినందుకు ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపాడట. కాగా ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి హోస్ట్ చేస్తున్న అమితాబ్ ‘ది ఇంటర్న్’, ‘బ్రహ్మస్త్ర’, ‘మేడే’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: వెంటనే ఆ యాడ్ నుంచి తప్పుకోండి అమితాబ్: నాటో అధ్యక్షుడు లేఖ -
మోదీకి యూఏఈ భారతీయ విద్యార్థి బహుమతి
దుబాయ్: దుబాయ్‌లో నివాసముంటున్న భారతీయ విద్యార్థి శరణ్ శశికుమార్ (14) ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి ఆయనకు గణతంత్ర దినోత్సవ బహుమానంగా ఇచ్చారు. దుబాయ్‌లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన విదేశాంగ శాఖ సహాయక మంత్రి వి మురళీధరన్ ద్వారా దాన్ని మోదీకి అందించనున్నారు. శరణ్ గీసిన స్టెన్సిల్ చిత్రంలో ప్రధాని మోదీ సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉంది. దీనిపై మురళీధరన్ స్పందిస్తూ.. కేరళకు చెందిన దుబాయ్ విద్యార్థి, యువ చిత్రకారుడు గీసిన 6 పొరల స్టెన్సిల్ పెయింటింగ్‌ను అందుకున్నానని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆ చిత్రాన్ని మోదీకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా బాలుడు ఇచ్చాడని తెలిపారు. ఆ పెయింటింగ్ 90 సెంటీమీటర్లు ఎత్తు, 60 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. దీన్ని గీయడానికి శరణ్‌కు ఆరు గంటలు పట్టినట్లు తెలిపింది. శరణ్ కోవిడ్–19 సమయంలో 92 మంది యూఏఈ అధికారుల చిత్రాలను గీశాడని చెప్పింది. శరణ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోగ్రాండ్ మాస్టర్ సర్టిఫికెట్ పొందాడు. -
కళాత్మకం: స్టోన్.. కాంతి
కొంతమంది జీవనం కళకే అంకితమవుతుంది. కళ కోసమే జీవిస్తుంటారు. కొందరి కళలు అసలు వెలుగు చూడవు. కొందరు వినూత్నంగా తమ కళాభిరుచిని చాటుతుంటారు. వారిలో 45 ఏళ్ల బ్రిటన్ ఆర్టిస్ట్ బెకె స్టోన్‌ఫాక్స్ చేరుతుంది. పేపర్, దారాలతో చేసిన పోర్ట్రెయిట్లు చూసిన వెంటనే కాదు రోజంతా అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి కళను సొంతంగా ఔపోసన పట్టింది స్టోన్ ఫాక్స్. ఇప్పటి వరకు మనం చూసిన చిత్తరువులు రోజులో ఎప్పుడూ ఒకే కాంతిలో దర్శనమిస్తుంటాయి. అయితే స్టోన్ ఫాక్స్ వేసిన పోర్ట్రెయిట్స్ మాత్రం పగటిపూట రంగులను మారుస్తాయి. త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రేరణ పొంది ఈ చిత్తరువులను రూపొందించడమే ఈ కళారూపాల ప్రత్యేకత. ఉదయం నుంచి పగటివేళకు సూర్యరశ్మి పెరుగుతున్నకొద్దీ ఈ పోర్ట్రయిట్ల రంగు పెరగడం లేదా తగ్గడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మెరుస్తూ ఉంటుంది. సాయంకాలానికి కొన్నిసార్లు లేత రంగులు దర్శనమిస్తాయి. లండన్‌కి చెందిన 45 ఏళ్ల బెకె స్టోన్‌ఫాక్స్ కాగితపు రంగు క్లిప్పింగ్‌లను ఉపయోగించి కేవలం ఆకారాలను తయారు చేయడంలో ప్రత్యేకత చూపుతుంది. ఈ ఆర్ట్‌కి చిన్న చిన్న కాగితపు ముక్కలను, సిల్క్, కాటన్ దారాలను ఉపయోగిస్తారు. చాలా కాలంగా ఈ ఆర్ట్ వర్క్ చేస్తున్నప్పటికీ, ఐదేళ్ళుగా ఈమె ప్రతిభ ప్రపంచ దృష్టిలో పడింది. ఈమె కళాసేకరణలు కల్పిత మానవ పాత్రల నుండి కుక్క, పిల్లి, గొరిల్లా, గుర్రం మొదలైన వివిధ జీవుల వరకు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడబోతున్నట్లుగా కనిపిస్తాయి. స్టోన్‌ఫాక్స్ ఎవరి ముఖమైనా మొత్తం ఆకారాన్ని కాగితాన్ని ఉపయోగిస్తూ దారాలతో అల్లి తయారు చేస్తుంది. కళతో ప్రపంచంలో దేనినైనా సృష్టించవచ్చు అంటుంది స్టోన్‌ఫాక్స్. ఇప్పటివరకు పురుషులు, జంతువుల బొమ్మలను మాత్రమే తయారుచేసిన స్టోన్ ఇప్పుడు మహిళల మనోభావాలను ప్రతిఫలింపజేసే చిత్తరువులను విభిన్నంగా సృష్టిస్తోంది. -
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్‌కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్‌లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
ప్రమాదంలో పిల్లలను కాపాడినందుకు శిక్ష!
న్యూఢిల్లీ : ఉత్తర కొరియాలో ఇటీవల సంభవించిన ఓ అగ్ని ప్రమాదం నుంచి మాజీ నాయకులు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ నేతల ఫొటోలకు బదులుగా తన ఇద్దరు పిల్లలను రక్షించుకున్నందుకు ఓ తల్లిని కొరియా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె నేరం రుజువైతే పది నుంచి 15 ఏళ్ల పాట కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ కఠినం అంటే జైల్లో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఉత్తర హ్యామాగ్యాంగ్ రాష్ట్రంలోని ఆన్సంగ్ కౌంటీలో ఒకే ఇంటిలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల ఓ పోర్షన్లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇరు కుటుంబాల తల్లులు బయట ఉన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెల్సి, వారు ఇంట్లోకి పరుగెత్తికెళ్లి తమ పిల్లలను రక్షించుకున్నారు. ఈ లోగా ఇద్దరు పిల్లలున్న ఓ తల్లి ఉంటున్న పోర్షన్ పూర్తిగా తగులబడి పోయింది. దాంట్లో ఉత్తర కొరియా మాజీ నేతలు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ ఫొటోలు పూర్తిగా ఖాళీ పోయాయి. పక్క పోర్షన్లోని ఫొటోలు సురక్షితంగానే ఉన్నాయి. పిల్లల ప్రాణాలను రక్షించుకున్న తల్లి, నేతల ఫొటోలను రక్షించలేక పోయినందుకు ఆమెను విచారిస్తున్నారు. ప్రస్తుతం మంటల్లో గాయపడిన పిల్లలకు వైద్యం కూడా చేయించుకోలేక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. రహస్యంగా సాయం చేస్తామని ఇరుగు పొరుగు వారు వచ్చినా పోలీసులకు భయపడి ఆమె సాయం నిరాకరిస్తోంది. ఉత్తరకొరియా నిబంధనల ప్రకారం ప్రతి కుటుంబం విధిగా ఈ ఇద్దరు కొరియా నేతల ఫొటోలను ఇంట్లో పెట్టుకోవాలి. అదీ ఏదో గదిలో కాదు, లివింగ్ రూమ్‌లో. ప్రముఖంగా కనిపించే చోట వాటిని ప్రదర్శించాలి. పక్కన, కింద వారున్న గ్రూపు ఫొటోలు తప్పా, ఇతరుల ఫొటోలు పెట్టరాదు. పైగా ఆ ఫొటోలు ఇంట్లో ఉంటున్న వారి తలలకన్నా ఎత్తులో ఉండాలి. అందరికన్నా వారు పెద్ద వారు అనే అర్థంలో ఈ నిబంధన. వారి ఫొటోలు ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని అప్పుడప్పుడు పోలీసు ఇన్స్పెక్టర్లు ఇంటింటికి వచ్చి తనిఖీ చేస్తారు. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దుమ్ము పట్టనీయరాదు. దుమ్ము పేరుకుంటే దాని స్థాయినిబట్టి జరిమానా విధిస్తారు. ఫొటోలను ప్రాణపదంగా చూసుకోవాలి. ఇద్దరు పిల్లలను రక్షించుకునే తొందరలో ఓ తల్లి వారి ఫొటోలను రక్షించడం మరచిపోవడంతోనే ఇప్పుడామెకు చిక్కులు. గతంలో ప్యాంగ్యాంగ్ను సందర్శించిన అమెరికా విద్యార్థి అట్టో వాంబియర్ కిమ్ ఇల్ సంగ్ పేరున్న ఓ పోస్టర్‌ను చించి వేసినందుకు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. లివింగ్ రూమ్‌లో ఈ నేతల ఫొటోలను అమర్చే గోడను ‘హానర్ వాల్’ అని పిలుస్తారని ఇప్పటి వరకు ఆరుసార్లు ఉత్తర కొరియా వెళ్లి వచ్చిన అమెరికాలోని ఇలినాయికి చెందిన రే చున్నింగమ్ అనే అధికారి తెలిపారు. ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదాలు, వరదల నుంచి ఈ నేతల ఫొటోలను రక్షించిన వారిని హీరోలుగా ప్రశంసించడంతోపాటు అవార్డులతో అక్కడి ప్రభుత్వం సన్మానిస్తుంది. ముఖ్యంగా చనిపోయిన సందర్భాల్లో. 2012లో ఉత్తర కొరియాలోని సిన్హంగ్ కౌంటీలో హాన్ హ్యాంగ్ గ్యాంగ్ అనే 14 ఏళ్ల బాలిక తన ఇంటిని వరదలు చుట్టుముట్టినప్పుడు ఈ ఇద్దరు నేతల ఫొటోలను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమెకు ‘కిమ్ జాంగ్ ఇల్ యువజన గౌరవ అవార్డు’ను ప్రకటించారు. ఆమె చదువుతున్న స్కూల్‌కు ఆమె పేరు పెట్టారు. అక్కడి నిబంధనల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు, సబ్వే రైళ్లలో కొరియా మాజీ నేతల ఫొటోలను ప్రముఖంగా ప్రదర్శించాలి. వారి పక్కనే తన తదనంతరం తన ఫొటోను ప్రదర్శించాల్సిందిగా ప్రస్తుత సుప్రీం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అలా ప్రకటించడం అరిష్టం అనుకున్నారేమో!? -
అరె ! ఫోటో భలే ఉందే : కోహ్లి
గువాహటి : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానాన్ని ఓ వ్యక్తి సరికొత్తగా చాటాడు. పాత మొబైల్ పోన్లతో కోహ్లి చిత్రపటాన్ని రూపొందించాడు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ అనే అభిమాని.. పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించి కోహ్లి చిత్రపటం రూపొందించాడు. ప్రస్తుతం కోహ్లి సేన శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 కోసం గువాహటిలో ఉంది. దీంతో అక్కడి హోటల్లో కోహ్లిని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు. తనకు వచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయిన కోహ్లి ఆ చిత్రపటంపై సంతకం చేశారు. అలాగే రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పారు. ‘ఇది చాలా అత్యుత్తమ క్రియేషన్.. వెల్ డన్.. బెస్ట్ విషెస్ ఫ్రమ్ కోహ్లి’ అని రాశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘కొద్ది నెలల కోసం కోహ్లి గువాహటిలో మ్యాచ్ కోసం వస్తున్నాడని నాకు తెలిసింది. దీంతో పాత మొబైల్ ఫోన్లు, వైర్లతో చిత్రపటాన్ని రూపొందించాను. ఇందుకోసం నాకు మూడు రోజుల పూర్తి సమయం పట్టింది. కోహ్లిని కలిసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆయన నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చార’ని తెలిపారు. Making art out of old phones. How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD — BCCI (@BCCI) January 5, 2020 -
33,000 రుద్రాక్షలతో బాల్ థాకరే చిత్రపటం
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ థాకరే 93వ జయంతోత్సవాల సందర్భంగా ఆర్టిస్ట్ చేతన్ రౌత్ 33,000 రుద్రాక్షలతో థాకరే ప్రత్యేక చిత్రపటం రూపొందించారు. బాలాసాహెబ్ థాకరేకు రుద్రాక్షలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వాటితోనే ఆయన చిత్రపటం రూపొందించానని రౌత్ చెప్పారు. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో 33,000 రుద్రాక్షలతో దీన్ని తయారుచేశానని..దీన్ని ప్రపంచ రికార్డుగా మలిచేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. థాకరే జయంతోత్సవాలకు అంకితం చేస్తూ ఈ చిత్రపటాన్ని ముంబైలోని శివసేన భవన్ ఎదురుగా అమర్చారు. కాగా దివంగత థాకరే స్మృతి చిహ్నం నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో ముంబై మేయర్ బంగ్లా ఉన్న శివాజీ పార్క్ ఏరియాలో థాకరే మెమోరియల్ నిర్మించనున్నారు. మెమోరియల్ నిర్మాణం కోసం సముద్రానికి అభిముఖంగా ఉన్న 11,500 చదరపు మీటర్ల స్ధలాన్ని ఇప్పటికే బాలాసాహెబ్ థాకరే రాష్ర్టీయ స్మారక్ న్యాస్ (ట్రస్టు)కు కేటాయించారు. -
అసెంబ్లీలో అమ్మ ఫోటో.. స్టాలిన్ ఆగ్రహం
-
‘బతికుంటే శశికళతో ఊచలు లెక్కిస్తుండేది’
సాక్షి, చెన్నై : అసెంబ్లీలో జయలలిత ఫోటో నెలకొల్పటంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో అమ్మ ఫోటోను అన్నాడీఎంకే నెలకొల్పింది. అయితే అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అంత సముచిత గౌరవం ఇవ్వడమేంటని? డీఎంకే ప్రశ్నలు గుప్పిస్తోంది. ‘ఒకవేళ జయలలిత ఇప్పుడు బతికి ఉంటే శశికళతోపాటు జైల్లో కూర్చుని ఊచలు లెక్కించేది. తమిళ గౌరవాన్ని చాటిన గొప్ప సీఎంల ఫోటోలు అసెంబ్లీలో ఉన్నాయి. అలాంటి వారి మధ్య నేరస్థురాలైన జయలలిత ఫోటోను ఉంచటం ఏంటి?. ఇది ముమ్మాటికీ అసెంబ్లీకి అవమానమే. తక్షణమే ఆ ఫోటోను తొలగించాలి’ అని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక ఈ కార్యక్రమాన్ని డీఎంకేతోపాటు, కాంగ్రెస్, ఐయూఎంఎల్ కూడా బహిష్కరించాయి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. అయితే ప్రభుత్వం మాత్రం అవేం పట్టన్నట్లు స్పీకర్ ధన్పాల్ చేతుల మీదుగా ఫోటోను ఆవిష్కరించేసింది. ఏడు ఫీట్ల ఎత్తున్న జయలలిత ఫోటోను సరిగ్గా ప్రతిపక్షాల బెంచ్ వైపు చూసే విధంగా అమర్చారు. ఈ కార్యక్రమంలో సీఎం పళని సామి, పన్నీర్ సెల్వం, మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతంలో మెరీనా బీచ్‌లో ఆమె స్మారక స్థూపం నెలకొల్పే సమయంలో కూడా సరిగ్గా ఇలాంటి విమర్శలే వినిపించాయి. అసెంబ్లీలో నెలకొల్పిన జయలలిత ఫోటో -
ప్రతిధ్వనించే పుస్తకం
కాలాతీత వ్యక్తులు ఎలాంటివారు కాలాతీత వ్యక్తులు? డాక్టర్ పి.శ్రీదేవి రాసిన ఈ నవలలో ప్రధానంగా ఉన్నవి నాలుగు పాత్రలు. మేనమామ అదుపాజ్ఞల్లో బతికే వైద్యవిద్యార్థి ప్రకాశం, మంచివాడే కానీ పిరికివాడు. అవసరమైన సందర్భంలో కూడా తగిన తెగువ చూపకపోవడం వల్ల అటు కళ్యాణినీ ఇటు ఇందిరనూ ఇద్దరినీ నష్టపోతాడు. ఒద్దికగా ఉండే సున్నిత మనస్కురాలు కళ్యాణి. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న రకం. చదవడానికి చప్పగా కనిపించినా సాధారణంగా అందరికీ ఇట్టే నచ్చేపాత్ర. విలాస జీవితాన్ని గడిపినా సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడి తన వ్యక్తిత్వం చాటుకోగలిగే వ్యక్తి కృష్ణమూర్తి. ఇక నాలుగోదీ, ఎక్కువ చర్చకు గురయ్యే పాత్ర, ఇందిర. ఒక విధంగా ఇందిరకు అనుగుణంగానే, లేదా ఇందిర పూనుకోవడం వల్లనే ఈ పాత్రల జీవితాలన్నీ మలుపు తిరుగుతాయి. చిన్నప్పుడే మరణించిన తల్లి, బాధ్యత లేకపోవడమే కాకుండా దురలవాట్లు కూడా గల తండ్రివల్ల చిన్న ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తూ జీవితంలో చాలా త్వరగా రాటుదేలిన పాత్ర ఈమెది. అంత కష్టాల్లోనూ తన షికార్లు వదులుకోదు. మనకు నచ్చింది చెయ్యగలగాలి, సంఘానికి వెరవకూడదంటుంది. పూర్తి నలుపు తెలుపుగా కాకుండా సహజమైన ఆలోచనాధోరణితో నడిచే రక్తమాంసాలున్న పాత్ర. ఆత్మవిశ్వాసం, స్వార్థం, ఈర్ష్య, జిత్తు అన్నీ కనబడతాయి. ‘నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కనుంచి వెళ్లేవారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయను? ఎవరి మటుకు వారు చూసి నడిచి వెళ్లాలి’ అంటుంది. చాలామంది మనుషులు ఇందిరల్లాగే ఉంటారు; కానీ బయటికి ఒప్పుకోరు. రచయిత్రి అంతరంగం ఏమిటి? ఇలాంటివాళ్లే బతుకుతారనా? ఇలా బతికితేతప్ప ఈ సమాజంలో నెగ్గుకురాలేమనా? అలాగని ఇందిర తన అంతరంగానికి ముసుగు వేసుకునే రకం కాదు. ‘ఏ పని చేసినా నేను కళ్లు తెరిచి చేస్తాను. ఏడుస్తూ ఏదీ చేయను. ఏది జరిగినా ఏడవను. నాకూ తక్కినవాళ్లకూ అదే తేడా’ అంటుంది. అదే సమయంలో ‘నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం’ తనదని చెబుతుంది. ఇద్దరు పరస్పర భిన్న వ్యక్తిత్వాలు గల ఇందిర, కళ్యాణి పాత్రల ప్రయాణాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. ఆధునిక స్త్రీ తాను స్వతంత్రురాలినన్న పేరుతో మోయాల్సివస్తున్న బరువును దింపుకునే పరిస్థితి లేకపోవడమూ కూడా ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి చూపారేమో అనిపిస్తుంది. 1957–58 మధ్య ధారావాహికగా వచ్చిన ఈ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా వచ్చింది. రాయడంలో గొప్ప ప్రతిభ కనబరిచి, మూడు పదుల వయసులోనే మరణించిన ఈ నవలా రచయిత్రి పి.శ్రీదేవి (1929–61) కూడా కాలాతీత వ్యక్తే. డా‘‘ పి.శ్రీదేవి -
పోర్ట్రేట్ పెయింటింగ్.. ఒక సవాల్
చిత్రం గీయడం చిన్న విషయమేమీ కాదు. ఆలోచనకు తగ్గట్టు కుంచెను కదిలించి.. అద్భుతాలను ఆవిష్కరించాలి. ఇలాంటి చిత్రకారులు చాలామందే ఉంటారు. కానీ ఒక బొమ్మను చూస్తూ ఉన్నది ఉన్నట్టు గీయడం (పోర్ట్రేట్ పెయింటింగ్) ఒక సవాల్. అంతటి కష్టమైన పనిని కృషి, పట్టుదలతో సునాయాసంగా చేసేస్తున్నాడు హైదరాబాద్ చిత్రకారుడు ముక్కపల్లి లక్ష్మీనారాయణ. పోర్ట్రేట్ పెయింటింగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నగరంలోని అత్తాపుర్ సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ ఆవిష్కరించిన అద్భుతాలకు బంగారు పతకాలు వరుసకట్టాయి. 2003లో పోర్చుగల్‌లో జరిగిన అండ్ర్ 19 ప్రపంచ పెయింటింగ్ పోటీలకు తాను గీసిన చిత్రాలను పంపగా గోల్డ్ మెడల్ వరించింది. అదే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగిన వరల్డ్ పెయింటింగ్ కాంపిటీషన్స్‌లోనూ, 2004లో జపాన్‌లో నిర్వహించిన పోటీల్లోనూ బంగారు పతకం కొల్లగొట్టాడు. అంతేకాకుండా మరెన్నో పోటీల్లో అవార్డులు అందుకున్నాడు. ఐదేళ్ల నుంచే ఆసక్తి.. మామ కుమారుడు రమేష్ గీసిన చిత్రాలను చూసి ఐదేళ్ల వయసులోనే ఆర్ట్‌పై ఆసక్తి పెంచుకున్న లక్ష్మీనారాయణ... అప్పటి నుంచి తన ముందు కనిపించే వ్యక్తులు, వివిధ వస్తువుల బొమ్మలు వేయడం ప్రారంభించాడు. అలా చిత్రాలు గీస్తూ ఇంటర్ పూర్తి చేసిన లక్ష్మీనారాయణ... జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పెయింటింగ్‌లో డిగ్రీ చేశాడు. ఆర్ట్ అదరహో.. జీహెచ్ఎంసీ నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా చందానగర్, పరేడ్‌గ్రౌండ్ ఎదురుగా మెట్రో పిల్లర్స్‌పై, జలగం వెంగళరావు పార్క్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన చిత్రాలు గీశాడు లక్ష్మీనారాయణ. సినీరంగంలోనూ తనదైన ప్రతిభ చూపి ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. ‘కంట్రోల్ సీ’ సినిమా పూర్తిగా ఆర్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అందులో హీరోయిన్ కలలో కనిపించే వాటిని బొమ్మలుగా వేయడం ఇందులో ప్రత్యేకత. ఈ సినిమాకు లక్ష్మీనారాయణే చిత్రాలు గీశారు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా కోసం అమితాబచ్చన్, ఎన్టీఆర్ తదితర ప్రముఖుల పోర్ట్రేట్ పెయింటింగ్స్‌ను భారీ టీన్స్‌పై వేసి అందరి అభినందనలు పొందాడు. ‘సార్ ప్రోత్సాహంతోనే’... ఇంటర్లో నేను గీసిన బొమ్మను చూసిన మా శ్రీధర్ సార్.. నన్ను ప్రోత్సహించి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరమని సూచించారు. ఆయన సలహాతోనే నేనిప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ఉచితంగా శిక్షణనిచ్చాను. సర్కార్ సహకారం అందిస్తే ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉచితంగా శిక్షణనివ్వాలని అనుకుంటున్నాను. - లక్ష్మీనారాయణ -
ఆ పెయింటింగ్ మరో సీక్రెట్ తెలిసింది!
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలీసా. అయితే శతాబ్ధాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయటపడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాత్వ శాస్త్రవేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దాదాపు ఐదు శతాబ్దాలు గడుస్తున్నా.. మోనాలీసా చిరునవ్వు వెనుక దాగున్న రహస్యం, ఆ చిత్రంలో ఆమె భిన్న కోణాల్లో ఎందుకు దర్శనమిస్తుంది? అసలు ఆమె ఎవరన్నది తెలియకపోయినా ఆదరిస్తూనే వస్తున్నారు. మోనాలీసా పెయింటింగ్ లో ఉన్న మహిళ.. ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య లిసా గెరార్డినీ అని సైంటిస్టు పాస్కల్ కొట్టే గతంలో తెలిపారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలు వ్యక్తంచేశారు. తాజాగా మరో విషయం బయటపడింది. డావిన్సీ తన దగ్గర పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చిన రూపం కూడా మోనాలీసాలో ఉందని, అతడు డావిన్సీకి గే లవర్ అని ఇటలీ పురాతత్వవేత్తలు చెబుతున్నారు. వ్యాపారి భార్య, గే లవర్ అయిన గియాన్ గియాకోమో లను కలిపి ఒకేరూపం ఇవ్వగా మోనాలీసా చిత్రరూపం ఏర్పడిందని ఇటలీకి చెందిన సిల్వానో విన్సెటీ వివరించారు. ఈయన పరిశోధనల్ని కూడా కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా, శతాబ్దాలు గడుస్తున్నాయి.. పరిశోధనలు జరుగుతూనే ఉన్నా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగానే మోనాలీసానా? కాదా? అన్న సందేహం మాత్రం నేటికీ తీరకపోవడం గమనార్హం. -
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు.