గువాహటి : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై అభిమానాన్ని ఓ వ్యక్తి సరికొత్తగా చాటాడు. పాత మొబైల్ పోన్లతో కోహ్లి చిత్రపటాన్ని రూపొందించాడు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ అనే అభిమాని.. పాత మొబైల్ ఫోన్లను ఉపయోగించి కోహ్లి చిత్రపటం రూపొందించాడు. ప్రస్తుతం కోహ్లి సేన శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 కోసం గువాహటిలో ఉంది. దీంతో అక్కడి హోటల్‌లో కోహ్లిని కలిసిన రాహుల్.. ఆ చిత్రపటాన్ని చూపించాడు.
తనకు వచ్చిన బహుమతిని చూసి ఆశ్చర్యపోయిన కోహ్లి ఆ చిత్రపటంపై సంతకం చేశారు. అలాగే రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పారు. ‘ఇది చాలా అత్యుత్తమ క్రియేషన్.. వెల్ డన్.. బెస్ట్ విషెస్ ఫ్రమ్ కోహ్లి’ అని రాశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దీని గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘కొద్ది నెలల కోసం కోహ్లి గువాహటిలో మ్యాచ్ కోసం వస్తున్నాడని నాకు తెలిసింది. దీంతో పాత మొబైల్ ఫోన్లు, వైర్లతో చిత్రపటాన్ని రూపొందించాను. ఇందుకోసం నాకు మూడు రోజుల పూర్తి సమయం పట్టింది. కోహ్లిని కలిసినప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. ఆయన నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చార’ని తెలిపారు.
Making art out of old phones.
— BCCI (@BCCI) January 5, 2020
How is this for fan love! 👏👏 #TeamIndia @imVkohli pic.twitter.com/wnOAg3nYGD
Comments
Please login to add a commentAdd a comment