ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి.
ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్‌రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట)
మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్‌కు సంబంధించిన అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్‌లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్‌లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment