Rs 2 crore
-
‘యస్’ సంక్షోభం: ప్రియాంక లేఖ కలకలం
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంలో మరో వివాదాస్పద అంశం వెలుగులోకి వచ్చింది. యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన లేఖలను జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. తన తండ్రి దివంగత మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను రూ. 2 కోట్ల రూపాయలకు విక్రయించినట్టు ధృవీకరిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా జూన్ 4, 2010 న యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌కు రాసిన లేఖ తాజాగా వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించి చెక్కు ద్వారా ప్రియాంక గాంధీకి చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చెక్కును స్వీకరించినట్లు ఆమె రాణాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రించిన తన తండ్రి రాజీవ్ గాంధీ పెయింటింగ్‌ను కొనుగోలుకు రాణా కపూర్ చెల్లింపులు, ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారన్న ఆరోపణలు తాజగా సంచలనం రేపుతున్నాయి. ఇండియా టుడే అందించిన వివరాల ప్రకారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చిత్రాన్నిరాణాకపూర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.2 కోట్లకు 2010 జూన్ 3వ తేదీన తన పేరిట 134343 నెంబరు చెక్కు స్వీకరించినట్టుగా ప్రియాంక గాంధీ వాద్రా తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ నేత మిలింద్ దేవ్రా, రాణా కపూర్ మధ్య కూడా మధ్య ఉత్తరాలు నడిచినట్టు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ విమర్శలకు కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ, తాజా నివేదికలపై అధికారికంగా స్పందించాల్సి వుంది. (చదవండి : యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట) మరోవైపు రాణా కపూర్, ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేసిన పెయింటింగ్‌కు సంబంధించిన అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద 40 ప్రఖ్యాత పెయింటింగ్‌లు ఉన్నాయని తెలిపారు. అలాగే పోర్ట్రెయిట్లను కొనుగోలు చేసేటప్పుడు, వాల్యుయేషన్ కోసం నిపుణుల నుండి ధృవీకరణ పత్రాలను పొందుతాడు. కానీ రాజీవ్‌గాంధీ పెయింటింగ్‌కు సంబంధించి అలాంటి సర్టిఫికేట్ ఏదీ పొందలేని వ్యాఖ్యానించారు. అలాగే పెయింటింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి, ప్రియాంక గాంధీ వాద్రాది కాదని ఈడీ వర్గాలు పేర్కొడం గమనార్హం. -
రూ.2 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిందట..!
ముంబై: బాలీవుడ హీరోయిన్ కంగనా రనౌత్ తన గురువుగారికి ఖరీదైన గురుదక్షిణ చెల్లించుకున్నారు. యోగా గురు సూర్య నారాయణ సింగ్ కు సుమారు రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చారు. బాలీవుడ్ లో రంగ ప్రవేశానికి ముందు నుంచీ తనకు శిక్షణనిస్తున్న గురువు పట్ల ఈ క్వీన్ తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. ఆయన కోసం ఏదైనా చేయాలని అనుకున్న కంగనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ ఇంటిని తీర్చిదిద్దినట్టు సమాచారం. ఒక యోగా కేంద్రం ప్రారంభించేందుకు వీలుగా, ముంబైలోని అంధేరి వెస్ట్ లోని డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ని కంగన గురువు గారికి బహుకరించారు . యోగా శిక్షణకు అనువుగా ఉండేలా, కంగనా స్పెషల్ కేర్ తీసుకున్నారు. విశాలమైన బాల్కనీ సహా, అన్ని సౌకర్యాలతో మంచి యోగా సెంటర్ గా తీర్చిదిద్దారట. దీనికోసం కొన్ని రోజుల క్రితం కాంట్రాక్టర్ తో సంప్రదించి మరీ ఈ అపార్ట్ మెంట్ ను రూపొందించారట. కాగా బాలీవుడ్ రంగప్రవేశం ముందు జుహు బీచ్‌లో జిమ్నాస్టిక్స్ చేసుకుంటున్న సూర్యనారాయణ సింగ్ (సుమారు 18 ఏళ్ల వయస్సులో) కంగనాను ఆకట్టుకున్నారు. అప్పటినుంచి ఆయన యోగా శిక్షణలో తనను తాను మలుచుకున్నారు కంగనా. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ రంగూన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నసంగతి తెలిసిందే. -
27 ఏళ్ల తర్వాత రూ.2 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం కేసు ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అన్ని చోట్లా బాధితుడికే తీర్పు అనుకూలంగా వచ్చినా.. పరిహారం ఇచ్చేందుకు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ నిరాకరిస్తూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుకు రాజస్థాన్ కార్పొరేషన్ తలవంచక తప్పలేదు. దాదాపు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 27 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అమెరికా సిటిజన్ విజయం సాధించారు. వివరాలిలా ఉన్నాయి. అమెరికాకు చెందిన అలెగ్జిక్స్ సోనియెర్ 1988లో 'పీస్ మార్చ్'లో పాల్గొనేందుకు భారత్ వచ్చాడు. ఇతర కార్యకర్తలతో కలసి సోనియెర్ ఓ వాహనంలో వెళ్తుండగా.. జైపూర్ సమీపంలో రాజస్థాన్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోనియెర్ కోమాలోకి వెళ్లారు. రాజస్థాన్, గుజరాత్‌లలో అతనికి చికిత్స చేయించినా కోమాలోంచి బయటకు రాలేదు. చికిత్స కోసం అతణ్ని అహ్మదాబాద్ నుంచి అమెరికాకు తరలించారు. తమకు 2 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా బాధితుడి తల్లి డొమినిక్వె సోనియెర్ రాజస్థాన్ రోడ్డు యాక్సిడెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. 6శాతం వడ్డీతో 1.25 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రిబ్యునల్ రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కార్పొరేషన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పరిహార మొత్తాన్ని కోటి రూపాయలకు తగ్గించింది. అయితే కార్పొరేషన్ పరిహారం చెల్లించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ పిటిషన్‌ను కొట్టివేస్తూ బాధితుడికి 1.17 కోట్ల రూపాయల పరిహారం పాటు 6 శాతం వడ్డీ (కేసు దాఖలు చేసిన తేదీ నుంచి) చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్కే అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పరిహారం, వడ్డీ కలిపితే దాదాపు 2 కోట్లకు పైగా అవుతుంది. -
రూ.2 కోట్ల విలువైన ఎర్ర చందనం పట్టివేత
చిత్తూరు జిల్లా: చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఎర్ర చందనం విలువ రూ.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 23 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్‌లోని జునవెల్లి వ్యాలీ వద్ద ఒకటి, చర్లపల్లి పారిశ్రామిక వాడలో మరొక కొత్త ఫైర్ స్టేషన్‌ను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కొక్క ఫైర్ స్టేషన్‌కు దాదాపు రూ.2కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో మంగళవారం రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన 34 మందిని అదుపులోకి తీసుకుని... అలాగే 9 వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు నిందితులను తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం పోలీసులు పీలేరు పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఆదివారం రూ. కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.