అమేజింగ్‌ ఆర్ట్‌ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో! | Artist Tripping Talent Makes Internet Go Crazy Watch This Fun Video | Sakshi
Sakshi News home page

అమేజింగ్‌ ఆర్ట్‌ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!

Published Sun, Oct 24 2021 11:31 AM | Last Updated on Sun, Oct 24 2021 12:00 PM

Artist Tripping Talent Makes Internet Go Crazy Watch This Fun Video - Sakshi

ఇంటర్నెట్‌లో మనం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అవి చాలా ఆసక్తి కరంగా పన్నీగానూ, నవ్వు వచ్చే విధంగానూ ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం విస్మయానికి గురిచేసే విధంగానే కాకుండా ఒక ఆర్టిస్ట్‌ కళాత్మక దృష్టి కోణం అగుపడుతున్నట్లుగా ఎంతో చక్కగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మొదట మనకి ఒక అందమైన అమ్మాయి నెలపై కూర్చొని న్యూస్‌ పేపర్‌ చదువుతున్నట్లు అనిపిస్తుంది. అంతలోనే ఆ అమ్మాయి మీద వేరే అమ్మాయి వచ్చి ఒక కర్చీఫ్‌ వేసేటప్పటికీ  ఇంతలో కూర్చొని చదువుతున్న ఆ అమ్మాయి కాస్త చిత్రంగా మారిపోతుంది.

(చదవండి: తింగరోడు.. లైవ్‌ టెలికాస్టింగ్‌లో ఫోన్‌ చోరీ! కట్‌ చేస్తే..)

ఈ క్రమంలో ఈ అ‍మ్మాయి ఆ చిత్రాన్ని చెరిపి దానిపైన అందంగా నవ్వుతూ కూర్చొంటుంది. మళ్లీ కాసేపటికి అదంతా చిత్రంగా మారిపోయి దాన్ని చిత్రిస్తున​ అదే అ‍మ్మాయి  ఆర్టిస్టుగా  వీడియో చివర్లో కనిపిస్తుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆర్టిస్టే తనను తానే అన్నిరకాలుగా చిత్రికరించి అద్భుతంగా రూపొందించడం విశేషం. ఇంతకీ ఆమె ఎవరంటే? అంతర్జాతీయ త్రీడీ పెయింటింగ్‌ కళాకారిణీ, వరల్డ్‌ రికార్డు గ్రహీత అయిన  శిఖా శర్మ. తన 'ట్రిప్పింగ్' ప్రతిభతో చూపుర దృష్టిని మరల్చినివ్వని  విధంగా అ‍త్యంత అద్భుతంగా ప్రదర్శిస్తుంది. ఇది చదవడం కంటే చూడటానికి చాలా సరదాగా ఉంటుంది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి:  అందుకే ఇంగ్లండ్‌ నుంచి వస్తున్నారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement