న్యూఢిల్లీ : రాక్‌స్టార్స్‌ను తలిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటిపై ఎన్ని టాటూలు ఉన్నాయ్? అవి ఏంటో తెలుసా..? తెలియాలంటే మాత్రం ఈ వార్త చదవాల్సిందే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్‌లో ప్రసారమైన మెగా ఐకాన్స్ ఎపిసోడ్‌లో కోహ్లే ఈ పచ్చబొట్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘చిన్నతనం నుంచే పచ్చబొట్లు వేసుకునే అలవాటు ఉంది. తరువాత ఈ టాటులు మనకు ఎదో సొంత గుర్తింపునిస్తాయని అర్థమైంది. నా మోచితిపై ఉన్న లార్డ్ శివ టాటూ నా జీవిత ప్రయాణం ఎలా సాగిందో ప్రతిబింబిస్తోంది.’ అని తెలిపారు.
ఇలా తన ప్రయాణంలోని విజయాలకు చిహ్నంగా కోహ్లి మొత్తం 9 పచ్చబొట్లు పొడిపిచ్చుకున్నాడు. మూడేళ్లప్పుడే క్రికెట్‌కు పరిచయం చేసిన తన తల్లిదండ్రులపై తనకున్న ప్రేమకు చిహ్నంగా ప్రేమ్, సరోజ్ పేర్లను టాటులుగా మజిల్స్‌పై వేసుకున్నాడు. తన ఆరాధ్యదైవమైన లార్డ్ శివ పచ్చబొట్టును మోచేతిపై, దీని పక్కనే 22 అడుగుల పిచ్‌కు చిహ్నంగా ఓ మఠం గుర్తును పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు. వన్డే, టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లో అందుకున్న క్యాప్ నెంబర్స్ 175, 269 నెంబర్లను, తన దూకుడుకు చిహ్నంగా ట్రైబల్ టాటూను వేసుకున్నాడు. తన జన్మ రాశి అయిన వృశ్చిక రాశిని తెలియజేసేలా జోడియాక్ స్టైల్‌లో కుడి మజిల్‌పై స్కార్పియో అని రాయించుకున్నాడు. ఎడమ చేతిపై జపనీస్ సమురై అనే పెద్ద టాటూను న్యాయం, ధైర్యం, దయాగుణం, సభ్యత, గౌరవం, భక్తి, నిజాయితీలకు చిహ్నంగా, కుడి భుజంపై దేవుడి కన్నును టాటుగా వేయించుకున్నాడు. దేవుడి కన్ను టాటూ తనకు ప్రత్యేకమని తెలిపాడు. దీనిపైన ఓం గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. ఈ పదాన్ని ప్రపంచంలోనే అందరూ ఒకేలా పలుకుతారని చెప్పుకొచ్చాడు.
కోహ్లి టాటూ చిత్రాలు కోసం కింది స్లైడ్ షోను క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment