రోహిత్ శర్మ (ఫైల్‌ఫొటో)
ఇస్లామాబాద్ : ఆసియాకప్‌లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గైర్హాజరీతో సారథ్య బాథ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లే. అతని విషయంలో చాలెంజ్ చేయలేరు. కానీ అతను లేకుండా భారత జట్టు ఆసియాకప్‌లో అదరగొట్టింది. విరాట్ మూడో నెంబర్ బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కానీ ఆసియాకప్‌లో రోహిత్ అద్బుతంగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. మైదానంలో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు. అతని కెప్టెన్సీ రోజు రోజుకు మెరుగైంది. ఐపీఎల్‌లో కూడా అతని కెప్టెన్సీ చూశాను. ఆటగాళ్ల సొంత నిర్ణయాలను అనుమతిస్తాడు. వారికనుగుణంగా ఆడే స్వేచ్ఛను ఇస్తాడు. రోహిత్ ఓ అద్బుత కెప్టెన్.’ అని యూనిస్ కొనియాడాడు. (చదవండి: కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడా?)
ఆసియాకప్ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు. ‘భారత్ నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన జట్టు. ఈ జట్టులో వరల్డ్ క్లాస్ ఓపెనర్స్ ఉన్నారు. రోహిత్, ధావన్‌లు ప్రతిసారి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థులకు కష్టంగా ఉంటుంది. భారత్ విజయాల పట్ల నేనేం ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే భారత్ ఓ పెద్ద దేశం. ఆదేశంలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ప్రాంతానికి క్రికెట్ విస్తరించింది. భారత పేస్ బౌలర్లు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. వారంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారికి ఐపీఎల్ మంచి అవకాశాలను ఇచ్చింది. భారత్‌లో క్రికెట్ వేదికలు చాలా మార్పును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ ఎంతో మంది యువఆటగాళ్లను పరిచయం చేసింది.’ అని తెలిపాడు. ఇక యూనిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో 789 వికెట్లు పడగొట్టాడు. (చదవండి: కోహ్లిని ఎద్దుతో పోల్చిన రవిశాస్త్రి)
Comments
Please login to add a commentAdd a comment