విరాట్‌ కోహ్లికి ప్రేమతో.. | Virat Kohli Fan Grabbed Everyones Attention with 16 Tattoos | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లిపై ప్రేమతో..

Published Sun, Dec 22 2019 4:35 PM | Last Updated on Sun, Dec 22 2019 8:55 PM

Virat Kohli Fan Grabbed Everyones Attention with 16 Tattoos - Sakshi

2016లో డిసైడ్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లిపై తనకున్న ప్రేమాభిమానాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు. కానీ ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఒంటిపై 16 ట్యాటూలు వేయించుకోవాలని ఫిక్స్‌ అయ్యాడు. కానీ ట్యాటూలకు కావాల్సిన డబ్బులు లేవు. దీంతో పైసా పైసా పోగుచేసి తాను అనుకున్నది సాధించాడు. విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు అతడి జెర్సీ నంబర్‌ 18తో సహా శరీరంపై 16 చోట్ల పచ్చబోట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు పింటు బెహరా అనే ఓ అభిమాని. 

కటక్‌: వెస్టిండీస్‌తో నిర్ణయాత్మకమైన చివరి వన్డే కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని పింటు బెహరా అనే ఓ అభిమాని కలిశాడు. అయితే రెగ్యులర్‌ ఫ్యాన్‌గానే ట్రీట్‌ చేస్తున్న సమయంలో చొక్కా విప్పి తన ఒంటిపై ఉన్న ట్యాటూలను కోహ్లికి చూపించాడు. దీంతో కోహ్లి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఒంటి నిండా కోహ్లికి సంబంధించిన మొత్తం 16 ట్యాటూలు ఉన్నాయి. ఇందులో కోహ్లి జెర్సీ నంబర్‌ 18 కూడా ఉండటం విశేషం. ఇక ఈ ట్యాటూలపై పింటు బెహరా స్పందించాడు. 

‘నేను క్రికెట్‌ ప్రేమికుడిని. విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అభిమానం. ఆటపై అతడికున్న డెడికేషన్‌కు, బ్యాటింగ్‌ స్టైల్‌తో నా మనసు గెలుచుకున్నాడు. అయితే అతడిపై నాకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని 2016లో భావించాను. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఒంటినిండా ట్యూటూలు వేయించుకోవాలని డిసైడ్‌ అయ్యాను. అయితే దానికి చాలా ఖర్చు అవుతుందని తెలిసి నిరుత్సాహపడ్డాను. అయితే పైసా పైసా పోగుచేసి రూ.లక్ష జమచేసి ఈ ట్యాటూలు వేయించుకున్నాను. స్వదేశంలో కోహ్లి ఆడే ప్రతి మ్యాచ్‌కు నేను తప్పకుండా వెళతాను. ఆర్థిక పరిస్థితి కారణంగా విదేశాల్లో జరిగే మ్యాచ్‌లకు వెళ్లలేకపోతున్నాను. అవకాశం వస్తే కోహ్లికి మద్దతుగా విదేశాలకు కూడా వెళ్లడానికి సిద్దం’అంటూ బెహరా పేర్కొన్నాడు. ప్రస్తుతం పింటు బెహరాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement