
వరల్డ్ రికార్డ్ క్రేజ్ ఉన్న వాళ్లు దాన్ని సాధించేందుకు అంతే క్రేజీగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్రేజీ లిస్ట్‌లోకి యూకేకు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్‌నూ చేర్చొచ్చు. శరీరంపై తన కూతురు పేరుతో 667 టాటూలు వేయించుకున్నాడు. ఆల్‌రెడీ వీపు వెనుక భాగంపై ‘లూసీ’ పేరుతో 267 టాటూలు వేయించుకుని 2017లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు.
అయితే 2020లో డ్రా విజిల్ అనే 27 ఏళ్ల మహిళ తన శరీరం మీద తన పేరుతో 300 టాటూలు వేయించుకుని మార్క్ ఓవెన్ ఎవాన్స్ గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసింది. ఆ మహిళను అధిగమించి, ఎలాగైనా తిరిగి గిన్నిస్ రికార్డును పొందాలని మార్క్ నిశ్చయించుకున్నాడు. అందుకోసం అతను తన కూతురు బర్త్ డే సందర్భంగా తన రెండు కాళ్లపై మరో నాలుగు వందసార్లు ఆమె పేరును టాటూలు వేయించుకున్నాడు. అలా మొత్తం 667 టాటూస్‌తో మార్క్ ఓవెన్ మరోసారి వరల్డ్ గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు.
(చదవండి: జపాన్‌లో శరత్కాల వేడుకలు!)
Comments
Please login to add a commentAdd a comment