మిస్సోరి: మిస్సోరీకి చెందిన 46 ఏళ్ల మైఖేల్ కాంప్‌బెల్ తన ముఖమంతా పూర్తిగా టాటూలు వేయించుకున్నందుకు గానూ 'ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమినల్' గా పిలుస్తున్నారు. అంతే కాదు యురోపియన్ సంతతికి చెందిన మైఖేల్ ముక్కు, పెదవులు, మెడ కింద మాత్రమే చర్మం కనిపిస్తుంది తప్ప ముఖం అంతా టాటులతో నిండి ఉంటుంది. పైగా నదుదిటిపై పెంటాగ్రామ్, అతని మెడపై విల్లులాంటి టై, కుక్క అతని గుండు పైన 88 సంఖ్య ఉన్నాయి.
(చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!)
అయితే ఇటీవలే అత్యాచారయత్నం కేసులో అరెస్టు అయిన నేరస్తుడు. ఈ మేరకు మైఖేల్ గతేడాది ఆస్తి నష్టం, దాడి వంటి ఆరోపణలతో ఆరు నెలలు జైలు శిక్షను కూడా అనుభవించాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయితే మరోసారి జీవితాంతం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు మైఖేల్ కేవలం 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని మొదటి నేరారోపణ జరిగినట్లు వివరించారు.
కానీ ఆ సమయంలో మైఖేల్ ముఖం పై కేవలం ఒక పచ్చబొట్టు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇటీవలే అతని తండ్రి కోవిడ్‌తో చనిపోవడంతో అతని జ్ఞాపకార్థం మైఖేల్ ఇద్దరూ సోదరీమణులు కూడా టాటులు వేయించుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు టాటుల కుటుంబం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment