బ్రాండ్ బొట్లు
అరగుండు నుంచి కనుగుడ్డు వరకూ..
శరీరం మీద టాటూలు వేయించుకుని వాణిజ్య సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించడం... పాశ్చాత్య దేశాల్లోని చాలామందికి ఒక ఉపాధి మార్గం. తమ సంస్థలకు ప్రచారాన్ని కల్పించుకోవడానికి టాటూ వేయించడం ఒక చక్కటి మార్గమని చాలా ‘బ్రాండ్లు’ నమ్ముతున్నాయి. ఇదే సమయంలో ఉత్సాహవంతులు శరీరంపై టాటూలు పొడిపించుకుని దీన్నొక సంపాదన మార్గంగా మార్చుకుంటున్నారు. దీన్నొక పార్ట్‌టైమ్ జాబ్‌గా మొదలుపెట్టి దీన్నే ఫుల్‌టైమ్ బిజినెస్‌గా మార్చుకున్న వ్యక్తి మేథ్యూవాలెన్. ఇతడి శరీరం 80 శాతం టాటూలతోనే నిండిపోయింది. అనేక బ్రాండ్ల వాళ్లు వాలెన్ కాలిబొటనవేలు నుంచి తలలోని సుడి వరకూ అణువణువునూ టాటూలతో నింపేశారు. ఇతడి వెంట్రుకలు కూడా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. అరగుండు లో కూడా ఐదారు బ్రాండ్ల టాటూలున్నాయి. ఆఖరికి వాలెన్ కనుగుడ్డులో కూడా టాటూ ఉంది! అంటే ఇతడి ‘బ్రాండ్’ బాజా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు!