కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి | Russian Airplane Collapsed | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు దుర్మరణం

Published Wed, Jan 24 2024 3:35 PM | Last Updated on Wed, Jan 24 2024 4:19 PM

Russian Airplane Collapsed - Sakshi

మాస్కో: రష్యా  యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు.

రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement