
భువనేశ్వర్: ఒడిశాలో రష్యా పౌరుల మిస్టరీ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకే హోటల్‌లో ఇద్దరు రష్యన్లు మృతి చెందిన మిస్టరీ వీడకముందే రష్యాకు చెందిన మరో పౌరుడు మృతి చెందాడు. రెండు వారాల వ్యవధిలో ముగ్గురు రష్యన్లు మరణించటంతో ఇంతకి ఒడిశాలో ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. జగత్‌సింఘ్‌పూర్ జిల్లాలోని పారాదిప్ పోర్టులో ఓ షిప్‌లో మంగళవారం రష్యా పౌరుడి మృతదేహం లభ్యమైంది.
‘ఎంబీ అల్ద్నాహ్’ షిప్‌లో చీఫ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న 51 ఏళ్ల మిలియాకోవ్ సెర్గేగా పోలీసులు గుర్తించారు. ఆ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వస్తోంది. నౌకలోని తన ఛాంబర్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు సమాచారం. అయితే, అతడి మృతికి గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఒకే హోటల్‌లో ఇద్దరు..
గతంలో దక్షిణ ఒడిశాలోని రాయగడ నగరంలో ఓ హోటల్‌లో ఇద్దరు టూరిస్టులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. అందులో ఒకరు రష్యా చట్ట సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. వారు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా గతంలో మాట్లాడటం చర్చకు దారి తీస్తోంది. రష్యా చట్ట సభ్యుడు పావెల్ ఆంటోవ్(65) డిసెంబర్ 24న హోటల్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అంతకు ముందు డిసెంబర్ 22న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61)హోటల్ గదిలో మృతి చెందాడు. ఈ రెండు కేసులపై ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ‘పుతిన్’ను వ్యతిరేకిస్తే అంతేనా? ఒడిశాలో మరో రష్యన్ మిస్సింగ్!
Comments
Please login to add a commentAdd a comment