సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్ ధర రూ. 83
నేడు వాటాల విక్రయం
న్యూఢిల్లీ: సెయిల్ షేర్ల విక్రయ ధరను ప్రభుత్వం రూ. 83గా ఖరారు చేసింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను శుక్రవారం అమ్మకానికి పెట్టనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 1,500-1,700 కోట్ల మధ్య నిధులు లభించనున్నాయి. కాగా, బీఎస్‌ఈలో గురువారం సెయిల్ షేరు 85.35 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే డిజిన్వెస్ట్‌మెంట్‌కు 2.75% డిస్కౌంట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు ధరలో 5% డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.