![SAIL reports Q4 profit of Rs 816 crore - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/1/SAIL.jpg.webp?itok=pv4lQ78y)
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం సెయిల్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో లాభాల బాట పట్టింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.771 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.816 కోట్ల నికర లాభాలు (స్టాండ్‌అలోన్) వచ్చాయని సెయిల్ తెలిపింది. ఆదాయం బాగా పెరగడంతో ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.14,544 కోట్ల నుంచి రూ.17,265 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,833 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.482 కోట్లకు తగ్గాయని సెయిల్ తెలిపింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెయిల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.76 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment