నడిసంద్రంలో బిక్కుబిక్కుమంటూ.. | Fishermen Stuck In Sea Rescued By The Help Of Boat Sail | Sakshi

తెరచాపే తీరానికి చేర్చింది.. 

Oct 17 2020 8:15 AM | Updated on Oct 17 2020 8:16 AM

Fishermen Stuck In Sea Rescued By The Help Of Boat Sail - Sakshi

పాడైన బోటులో మత్స్యకారులు

చీరాల టౌన్‌ : నడిసంద్రం.. ఇంజిన్‌ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్‌ రిగ్‌ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి )

ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్‌ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్‌ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement