హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. 2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
‘తొలి దశలో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు చేరుస్తాం. తదుపరి దశలో వార్షిక సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుతాం. స్టీల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 0.5% వృద్ధి చెందుతోంది. గతేడాది భారత్ ఏకంగా 13 శాతం వృద్ధి నమోదు చేసింది. వచ్చే పదేళ్లు భారత్‌లో స్టీల్ రంగం ఏటా సగటు వృద్ధి 8%గా ఉంటుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment