సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్ | New chairman of SAIL PK Singh | Sakshi
Sakshi News home page

సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్

Published Tue, Sep 1 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్

సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్

న్యూఢిల్లీ: సెయిల్ కొత్త చైర్మన్‌గా పీకే సింగ్ ఎంపికయ్యారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా ఉన్న పీకే సింగ్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈయన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా 2012లో పగ్గాలు చేపట్టారు. పీకే సింగ్ ఐఐటీ-రూర్కీ పూర్వ విద్యార్థి.  గతంలో సెయిల్ చైర్మన్‌గా సీ.ఎస్. వర్మ ఉండేవారు. జూన్ నెలలో ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను కొత్త చైర్మన్ నియామకం జరిగేంత వరకు స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ పర్యవే క్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement