PK Singh
-
సీసీఐ కార్యదర్శిగా పి.కె. సింగ్
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త కార్యదర్శిగా పి.కె.సింగ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా సీసీఐకి ఆయన న్యాయపరమైన అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శి పోస్టులో నియామకం కోసం సీసీఐ సెప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, సీసీఐకి అయిదేళ్ల పాటు సలహాదారుగా అనుభవమున్న వారిని కూడా ఎంపిక చేయొచ్చన్న నిబంధన మేరకు సింగ్‌ను నియమించినట్లు సంస్థ తెలిపింది. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగం లో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులకు చెక్ చెప్పేందుకు, విలీనాలు.. కొనుగోళ్ల డీల్స్‌ను నియంత్రించేందుకు సీసీఐ ఏర్పాటైంది. -
సెయిల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పీకే సింగ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజ సంస్థ సెయిల్ చైర్మన్‌గా ప్రకాశ్ కుమార్ సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన మూడేళ్లపాటు సెయిల్‌కు సేవలను అందించనున్నారు. ఈయన 2012 నుంచి దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థైన పీకే సింగ్ తన కెరీర్‌ను 1980లో బొకారో స్టీల్ ప్లాంటులో ప్రారంభించారు. అటు తర్వాత ఐఐఎస్‌సీవో స్టీల్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంటులలో పనిచేశారు. -
సెయిల్ కొత్త చైర్మన్ పీకే సింగ్
న్యూఢిల్లీ: సెయిల్ కొత్త చైర్మన్‌గా పీకే సింగ్ ఎంపికయ్యారు. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా ఉన్న పీకే సింగ్‌ను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు (పీఈఎస్బీ) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్‌గా ఎంపిక చేసింది. ఈయన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ సీఈవోగా 2012లో పగ్గాలు చేపట్టారు. పీకే సింగ్ ఐఐటీ-రూర్కీ పూర్వ విద్యార్థి. గతంలో సెయిల్ చైర్మన్‌గా సీ.ఎస్. వర్మ ఉండేవారు. జూన్ నెలలో ఆయన పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను కొత్త చైర్మన్ నియామకం జరిగేంత వరకు స్టీల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ సింగ్ పర్యవే క్షించారు.