ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..! | Two Women Naval Officers Embark On Solo Global Voyage | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని చుట్టిరానున్న ఇద్దరు నేవీ ఆఫీసర్లు..!

Oct 3 2024 11:05 AM | Updated on Oct 3 2024 11:18 AM

Two Women Naval Officers Embark On Solo Global Voyage

భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్‌ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్‌ కమాండర్లు దిల్నా, రూపా ఈ యాత్రకు పూనుకున్నారు. వారి ప్రయాణాన్ని చీఫ్‌ ఆఫ్‌ ద నావల్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు.

 ఇద్దరు మహిళా అధికారులు వచ్చే ఏడాది మే నెలలో గోవాకు తిరిగివస్తారు. భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌వీ తరిణి నౌకలో వీరిద్దరూ ప్రయాణం ఆరంభించారు. సముద్రాల పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా వీరు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. కేరళలోని కాలికట్‌లో జన్మించిన దిల్నా  2014లో, పుదుచ్చేరికి చెందిన రూపా 2017లో ఇండియన్‌ నేవీలో చేరారు.   

(చదవండి: భేష్‌ సుకన్య మేడమ్‌..! నాటి రాజుల పాలన..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement