
కావేరి సీడ్స్ నష్టం రూ. 7 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కావేరి సీడ్ నికరంగా రూ. 7.45 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 1.25 కోట్ల లాభం ఆర్జించింది. మరోవైపు, తాజా క్యూ4లో ఆదాయం సుమారు రూ. 40 కోట్ల నుంచి రూ. 44 కోట్లకు పెరిగింది. అటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ ఆదాయం రూ. 1,161 కోట్ల నుంచి రూ. 892 కోట్లకు క్షీణించింది. నికర లాభం సైతం రూ. 300 కోట్ల నుంచి రూ. 173 కోట్లకు తగ్గింది.