న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–.జూన్ క్వార్టర్(2019–20, క్యూ1)లో 6 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.160 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ. 151కోట్లకు చేరిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,626 కోట్ల నుంచి రూ.5,026 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,386 కోట్ల నుంచి రూ.4,793 కోట్లకు చేరాయని తెలిపింది. గత క్యూ1లో 8.93 లక్షలుగా ఉన్న మొత్తం టూ, త్రీ వీలర్ల అమ్మకాలు (ఎగుమతులతో కలుపుకొని) ఈ క్యూ1లో 8.84 లక్షలకు తగ్గాయని తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 8 శాతం పెరిగి 4.17 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2.95 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 11 శాతం వృద్ధితో 40,000కు పెరిగాయని పేర్కొంది. ఎగుమతులు మాత్రం భారీగా తగ్గాయని, అందుకనే మొత్తం అమ్మకాలు క్షీణించాయని వివరించింది. నికర లాభం 6 శాతం తగ్గడంతో బీఎస్‌ఈలో టీవీఎస్ మోటార్ షేర్ 4% నష్టంతో రూ.380 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment