న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికి కాలంలో రూ.147 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 11 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బయోకాన్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.796 కోట్ల నుంచి రూ.954 కోట్లకు పెరిగిందని బయోకాన్ చైర్‌పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా తెలిపారు. స్మాల్ మోలిక్యూల్స్, బయోలాజిక్స్, రీసెర్చ్ సర్వీసుల్లో మంచి వృద్ధి కనబరిచామని పేర్కొన్నారు.
వర్థమాన దేశాల్లో బయోలాజిక్స్ రంగంలోకి ప్రవేశించడం, లెసైన్సింగ్ ఒప్పందాల కారణంగా ఆదాయం పెరిగిందని వివరించారు. తమ ప్రతిపాదిత బయోసిమిలర్, ట్రస్టుజుమ్‌వాబ్‌కు ఈఎంఏ ఆమోదం పొందడం.. ఈ క్యూ2లో సాధించిన కీలకమైన మైలురాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బయోకాన్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,010ను తాకి చివరకు 2 శాతం నష్టంతో రూ.980 వద్ద ముగిసింది.
బయోకాన్‌కు రూ.147 కోట్ల లాభం
Published Fri, Oct 21 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
Advertisement