Biocon Company
-
బయోకాన్ లాభం డౌన్
న్యూఢిల్లీ:హెల్త్‌కేర్ రంగ దిగ్గజం బయోకాన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది. బయోసిమిలర్స్, రీసెర్చ్ సర్వీసులు, జనరిక్స్ బిజినెస్ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్ పేపర్(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది. చదవండి: భారత్‌లో ట్విటర్ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్! -
GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్!
ముంబై: కాంట్రాక్ట్ రీసర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్‌క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్ పూర్తి అయితే గోల్డ్‌మన్ శాక్స్‌కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్‌మన్ శాక్స్ 2020 నవంబరులో బయోకాన్‌కు చెందిన బయోకాన్ బయాలాజిక్స్లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్‌లో జీవీకే కుటుంబానికి, డీఎస్ బ్రార్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది. ఇదీ జీవీకే బయో నేపథ్యం.. జీవీకే బయోను జీవీకే గ్రూప్, ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ మాజీ సీఈవో అయిన డీఎస్ బ్రార్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోటర్, చైర్మన్‌గా 2004లో జీవీకే బయో బోర్డులో బ్రార్ చేరారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థలో 2,500 పైచిలుకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవ శాస్త్రం, మాలిక్యూల్ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 450కిపైగా క్లయింట్లు ఉన్నారు. 2019–20లో రూ.950 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబిటా రూ.275 కోట్లుగా ఉంది. ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం సమకూరుతోంది. మిగిలినది కాంట్రాక్ట్ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్‌కు చెందిన ప్రీ–క్లినికల్ కాంట్రాక్ట్ రీసర్చ్ రంగంలో ఉన్న ఆరాజెన్ బయోసైన్సెస్‌ను కొనుగోలు చేసింది. చదవండి: Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం -
కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్
సాక్షి, బెంగళూరు: బయోకాన్ వ్యవస్థపాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘కరోనా కేసుల్లో నేను కూడా చేరాను. కానీ నాకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయి... త్వరలోనే కరోనా నన్ను వదిలేస్తుందనే ఆశతో ఉన్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మజుందార్ షాకు కరోనా అని తెలిసి చాలా మంది ఆమె త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. ‘ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ శశి థరూర్ ట్విట్ చేశారు. (ప్యాసింజర్ రైళ్లను ఇప్పట్లో నడపలేం) I have added to the Covid count by testing positive. Mild symptoms n I hope it stays that way. — Kiran Mazumdar Shaw (@kiranshaw) August 17, 2020 కిరణ్ మజుందార్ షాకు చెందిన బెంగళూరు బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్, కోవిడ్-19 చికిత్స కోసం సోరియాసిస్‌కు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని తిరిగి తయారు చేయడానికి కృషి చేస్తోంది. గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి గాను చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం నాలుగు కోవిడ్ కేంద్రాలలో.. 30 మంది రోగులపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ జరిపి.. దాని ఆధారంగా కోవిడ్-19 చికిత్సకు ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కానీ కోవిడ్-19 పై నేషనల్ టాస్క్ ఫోర్స్ డీజీసీఐ అనుమతితో సంబంధం లేకుండా క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్‌లో ఇటోలిజుమాబ్ ఔషధాన్ని చేర్చాలని నిర్ణయించింది. -
బయోకాన్ భళా!
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో హెల్త్‌కేర్ దిగ్గజం బయోకాన్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫార్మా రంగ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ 72 శాతం ఎగిసి రూ. 206.3 కోట్ల నికర లాభాలను సాధించించింది. బయోసిమిలర్స్, స్మాల్ మాలిక్యూల్స్ విక్రయాలు ఇందుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయం 30.44 శాతం పురోగమించి రూ. 1465.9 కోట్లను తాకింది. పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 78 శాతం పెరిగి రూ. 79 కోట్లకు చేరాయి. బయోకాన్ డైరెక్టర్ల బోర్డు 2019 జూన్ 17 న బ్రాండెడ్ ఫార్ములేషన్స్ (బిఎఫ్ఐ) వ్యాపారాన్ని బిబిఐఎల్కు స్లంప్ సేల్‌కి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకీకృత ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని బయోకాన్ వెల్లడించింది. అలాగే మయాంక్ వర్మను కంపెనీ కార్యదర్శిగా నియమించటానికి బయోకాన్ బోర్డు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ 6 (1) కింద కంప్లెయిన్స్ అధికారిగా కూడా ఆయన ఉంటారని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో బయెకాన్ కౌంటర్ల కొనుగోళ్లలో జోష్ నెలకొంది. 2.5 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
నగరంలో మరో బయోకాన్ యూనిట్
సాక్షి, హైదరాబాద్: బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ నగరంలో కొత్తగా యూనిట్ ప్రారంభించనుంది. దీంతోపాటు ప్రస్తుత యూనిట్‌ను మరింత విస్తరించనుంది. మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇక్కడ బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాతో సమావేశమయ్యారు. తమ అనుబంధ కంపెనీ సింజెన్ ద్వారా జినోమ్ వ్యాలీలో బయోకాన్ కొత్త ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1,000 హై స్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. సంబంధిత వివరాలన్నీ త్వరలో అందిస్తామని మంత్రికి తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును మంత్రి స్వాగతించారు. మజుందార్ షాకు ధన్యవాదాలు తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మంత్రి పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశమయ్యారు. నొవార్టీస్, బయోకాన్, మెర్క్, డెలాయిట్, జీఈ కంపెనీల సీఈఓలు, సీనియర్ ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ వాణిజ్య ఉప మంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరల్ తదితరులతోనూ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో కేటీఆర్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతినిధులు అభినందించారు. ఫార్మా సిటీ ఏర్పాటు వివరాలను మంత్రి వివరించారు. హైదరాబాద్ స్టార్టప్ ఈకో సిస్టమ్ గురించి ప్రస్తావించారు. కిరణ్ మజుందార్ షా హైదరాబాద్ పర్యటనలో నగరంలోని 20 టాప్ స్టార్టప్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జీఈ (సస్టెయినబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్) ప్రెసిడెంట్, సీఈఓ టెర్రీ బ్రెసెన్హమ్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడ్ డివైజెస్ పార్కు గురించి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీవర్క్స్‌లో జీఈ భాగస్వామి అవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. బయో టెక్నాలజీలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లోని కంపెనీలు అందిపుచ్చుకునేందుకున్న అవకాశాలపైన మంత్రితో ఆమె చర్చించారు. త్వరలోనే జినోమ్ వ్యాలీ పర్యటనకు వస్తానని తెలిపారు. జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేటర్‌లో జీఈ భాగస్వాములవ్వాలని కేటీఆర్ కోరారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను ఆమెకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ తో కలసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్ధమని ఆమె తెలిపారు. థాయ్ బృందంతోనూ... అనంతరం థాయ్‌లాండ్ ఉప వాణిజ్య మంత్రి చుటిమా బున్యాప్రఫసారాతో కేటీఆర్ భేటీ అయ్యారు. 20 థాయ్ కంపెనీలతో కూడిన బృందం తెలంగాణలో వ్యాపారావకాశాలపై చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ, హైదరాబాద్‌లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అవకాశాలపై బృందం ఆసక్తి చూపింది. తొలిసారి హైదరాబాద్ పర్యటనలోనే ఇక్కడి విధానాలు, పెట్టుబడి అవకాశాలు ఆకట్టుకున్నాయని చుటిమా తెలిపారు. ముంబైలోని ఇటలీ కాన్సూల్ జనరల్ స్టెఫానియా కస్టాన్జాతో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో టెక్స్టైల్, ఫార్మా, సినీ, అనుబంధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. బయోటెక్ రంగంలో ఇటలీ ఇకో సిస్టమ్, ఇక్కడ కంపెనీలు సంయుక్తంగా పని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, టెక్స్టైల్ రంగాల్లో పలు పెట్టుబడి అవకాశాలున్నాయని, అందుకు ముందుకొచ్చే ఇటలీ కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్ వివరించారు. ఆ మేరకు త్వరలో ఇటలీ కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో వ్యాపారావకాశాలు, పారిశ్రామిక విధానాలను వివరిస్తామని మంత్రికి ఆమె హామీ ఇచ్చారు. భారత్‌లో ఫార్మా అభివృద్ధి్దకి సవాళ్లు అనే అంశంపై ఫార్మా కంపెనీల సీఈఓలతో సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సీఈఓ ఉదిత్ బత్రా, నొవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. కేటీఆర్‌పై ప్రశంసలు కేటీఆర్‌పై కిరణ్ మజుందార్ షా ప్రశంసలు కురిపించారు. ‘‘ఆయన నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్ మరియు ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడింది. కేటీఆర్ లాంటి నాయకులను చూసినప్పుడు పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి కలుగుతుంది. ఇలాంటి నాయకులను బలపరచాలని అనిపిస్తుంది’’అంటూ కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని కూడా మజుందార్ షా ప్రశంసించారు. నగరం భవిష్యత్తులో మరింత పురోగతి సాధించేందుకు అయా రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. -
బయోకాన్ బంపర్ బోనస్
ఒక్కో షేర్‌కు రెండు బోనస్ షేర్లు.. రూ. 3 డివిడెండ్ న్యూఢిల్లీ: బయోకాన్ కంపెనీ బంపర్ బోనస్‌ను ప్రకటించింది. ఇన్వెస్టర్ల దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు రెండు బోనస్ షేర్లను ఇవ్వనుంది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయం తీసుకుందని బయోకాన్ తెలిపింది. అలాగే ఒక్కో షేర్‌కు రూ.3 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ సీఎండీ కిరణ్ మజుందార్ షా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో నికర లాభం 58 శాతం తగ్గిందని పేర్కొన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.354 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్)2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.148 కోట్లకు తగ్గిందని వివరించారు. అయితే మొత్తం ఆదాయం రూ.973 కోట్ల నుంచి రూ.974 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.609 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 2016–17 ఆర్థిక సంవత్సంరలో రూ.688 కోట్లకు, ఆదాయం 18% వృద్ధితో రూ.3,460 కోట్ల నుంచి రూ.4,079 కోట్లకు పెరిగిందని కిరణ్ తెలిపారు. -
బయోకాన్‌కు రూ.147 కోట్ల లాభం
న్యూఢిల్లీ: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికి కాలంలో రూ.147 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 11 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బయోకాన్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.796 కోట్ల నుంచి రూ.954 కోట్లకు పెరిగిందని బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా తెలిపారు. స్మాల్ మోలిక్యూల్స్, బయోలాజిక్స్, రీసెర్చ్ సర్వీసుల్లో మంచి వృద్ధి కనబరిచామని పేర్కొన్నారు. వర్థమాన దేశాల్లో బయోలాజిక్స్ రంగంలోకి ప్రవేశించడం, లెసైన్సింగ్ ఒప్పందాల కారణంగా ఆదాయం పెరిగిందని వివరించారు. తమ ప్రతిపాదిత బయోసిమిలర్, ట్రస్టుజుమ్వాబ్కు ఈఎంఏ ఆమోదం పొందడం.. ఈ క్యూ2లో సాధించిన కీలకమైన మైలురాయని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బయోకాన్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.1,010ను తాకి చివరకు 2 శాతం నష్టంతో రూ.980 వద్ద ముగిసింది.