సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో హెల్త్‌కేర్ దిగ్గజం బయోకాన్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫార్మా రంగ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ 72 శాతం ఎగిసి రూ. 206.3 కోట్ల నికర లాభాలను సాధించించింది. బయోసిమిలర్స్, స్మాల్ మాలిక్యూల్స్ విక్రయాలు ఇందుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయం 30.44 శాతం పురోగమించి రూ. 1465.9 కోట్లను తాకింది. పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 78 శాతం పెరిగి రూ. 79 కోట్లకు చేరాయి.
బయోకాన్ డైరెక్టర్ల బోర్డు 2019 జూన్ 17 న బ్రాండెడ్ ఫార్ములేషన్స్ (బిఎఫ్‌ఐ) వ్యాపారాన్ని బిబిఐఎల్‌కు స్లంప్ సేల్‌కి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకీకృత ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని బయోకాన్ వెల్లడించింది. అలాగే మయాంక్ వర్మను కంపెనీ కార్యదర్శిగా నియమించటానికి బయోకాన్ బోర్డు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ 6 (1) కింద కంప్లెయిన్స్ అధికారిగా కూడా ఆయన ఉంటారని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో బయెకాన్ కౌంటర్ల కొనుగోళ్లలో జోష్ నెలకొంది. 2.5 శాతం లాభాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment