
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది.
ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment