Coromandel International
-
కోరమాండల్ రూ.800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్‌ను భారత్‌లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది. ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్.. అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్‌లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. తగ్గిన నికర లాభం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్‌ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్‌లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
కోరమాండల్ నానోటెక్నాలజీ సెంటర్
చెన్నై: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా నానోటెక్నాలజీ సెంటర్‌ను కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. ఇది మొక్కల పోషణ, పంటల రక్షణ కోసం నానో ఆధారిత ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. ఐఐటీ ముంబైలో సైతం కంపెనీకి నానోటెక్నాలజీ కేంద్రం ఉంది. కోయంబత్తూరు సెంటర్ కోరమాండల్‌కు ఆరవ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. -
కోరమాండల్ లాభం రూ.755 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.20 శాతం ఎగసి రూ.757 కోట్లు నమోదు చేసింది. ఎబిటా రూ.1,059 కోట్లుగా ఉంది. టర్నోవర్ 31 శాతం క్షీణించి రూ.6,988 కోట్లకు వచ్చి చేరింది. ఫలితాల నేపథ్యంలో కోరమాండల్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో గురువారం 3.84 శాతం పడిపోయి రూ.1,073.85 వద్ద స్థిరపడింది. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు. -
వైజాగ్‌లో కోరమాండల్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఎంఈసీఎస్ (మోన్శాంటో ఎన్విరో–కెమ్ సిస్టమ్స్), టీకేఐఎస్ (థిసెన్‌క్రప్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రోజుకు 1,650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. భారత్ ప్రస్తుతం సల్ఫ్యూరిక్ యాసిడ్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలన్న స్వావలంబన భారత్ లక్ష్య సాకారం దిశగా కొత్త ప్లాంటు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం వార్షికంగా 6 లక్షల టన్నులుగా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యం .. మరో 5 లక్షల టన్నుల మేర పెరిగి 11 లక్షల టన్నులకు చేరుతుంది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రస్తుతం వైజాగ్‌లోని కోరమాండల్ ఫ్యాక్టరీ ఏటా 13 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, దాదాపు 4 లక్షల టన్నుల క్యాప్టివ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. -
కోరమాండల్ గ్రోశక్తి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా గ్రోశక్తి ప్లస్ అనే ఉత్పాదనను బుధవారం ప్రవేశపెట్టింది. జింక్‌తోపాటు నత్రజని, భాస్వరం, పొటాషియంతో ఈ ఎరువు తయారైంది. సంక్లిష్ట ఎరువుల్లో అత్యధిక పోషకాలు, ఎన్పీకే ఎరువుల్లో అధిక భాస్వరం గ్రోశక్తి ప్లస్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల వంటి పంటలకు ఇది అనుకూలం అని వివరించింది. ఎన్‌ఫోస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఉత్పాదన ద్వారా పంటలకు సమతుల పోషకాలు అందుతాయని కోరమాండల్ మాతృ సంస్థ మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. -
కోరమాండల్ డౌన్- ఈఐడీ ప్యారీ అప్?
ముంబై, సాక్షి: ముందురోజు(29న) సరికొత్త గరిష్టాన్ని తాకిన కోరమాండల్ ఇంటర్నేషనల్ కౌంటర్లో ఉన్నట్లుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇందుకు బ్లాక్‌డీల్ కారణమైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేటి ట్రేడింగ్ తొలి సెషన్లోనే కోరమాండల్ ఇంటర్నేషనల్ కౌంటర్లో బ్లాక్‌డీల్ ద్వారా 6.51 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇవి కంపెనీ ఈక్విటీలో 2.2 శాతం వాటాకు సమానంకాగా.. వీటి కొనుగోలుదారులు, విక్రేతలు ఎవరన్న అంశం వెల్లడికాలేదని విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎరువులు, రసాయనాల కంపెనీ కోరమాండల్ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 7 శాతం పతనమైంది. రూ. 793ను తాకింది. ప్రస్తుతం 5.4 శాతం నష్టంతో రూ. 806 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఈ షేరు రూ. 881 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకడం గమనార్హం! చదవండి: (బోరోసిల్ -ఫైనోటెక్స్ కెమ్.. యమస్పీడ్) ఈఐడీ ప్యారీ జోరు ఈ ఏడాది జూన్‌లో హోల్డింగ్ కంపెనీ అయిన ఈఐడీ ప్యారీ ఇండియా బ్లాక్‌డీల్ ద్వారా కోరమాండల్ ఇంటర్నేషనల్‌కు చెందిన 5.85 మిలియన్ షేర్లను షేరుకి రూ. 630 ధరలో విక్రయించింది. తద్వారా లభించిన నిధులను రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించనున్నట్లు షుగర్ తయారీ కంపెనీ ఈఐడీ ప్యారీ ఇండియా వెల్లడించింది. దీంతో తాజాగా మరోసారి కోరమాండల్ కౌంటర్లో బ్లాక్‌డీల్ ద్వారా భారీగా షేర్లు విక్రయంకావడంతో ఈఐడీ ప్యారీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత ఈఐడీ ప్యారీ షేరు 9.5 శాతం జంప్‌చేసింది. రూ. 366 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 353 వద్ద ట్రేడవుతోంది. -
కోరమాండల్ లాభం 301 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 301 శాతం అధికమై రూ.250 కోట్లు నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.87 శాతం పెరిగి 7.8 శాతంగా ఉంది. ఎబిటా 113 శాతం హెచ్చి రూ.415 కోట్లుంది. టర్నోవరు రూ.2,141 కోట్ల నుంచి రూ.3,224 కోట్లకు దూసుకెళ్లింది. ఒకవైపు కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు నమోదు చేశామని సంస్థ ఎండీ సమీర్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. నూట్రియెంట్ మరియు అనుబంధ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని చెప్పారు. ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్ విక్రయాలు 75 శాతం అధికమైందని వెల్లడించారు. మార్కెట్ వాటా 13.2 నుంచి 16 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు. -
కోరమాండల్ విశాఖ విస్తరణకు ‘గ్రీన్’ సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ తలపెట్టిన సామర్థ్య విస్తరణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది. రూ.225 కోట్ల విస్తరణ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన, సాధారణ నిబంధనల అమలుకు లోబడి పర్యావరణ అనుమతి మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ తెలియజేసింది. ఫాస్ఫారిక్ ఎరువుల తయారీలో దేశంలోనే రెండో అతిపెద్ద సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్. ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని శ్రీహరిపురంలో తన యూనిట్ వద్ద ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 700 టన్నుల (ఒక రోజు) నుంచి 1,000 టన్నులకు పెంచుకోవాలనే ప్రణాళికతో ఉంది. తద్వారా ప్రతిరోజూ 3,900 టన్నుల కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ తయారీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే తాజా ప్రాజెక్టు చేపట్టింది. దీనికి నిపుణుల కమిటీ ఇచ్చిన సానుకూల సిఫారసులతో పర్యావరణ అనుమతి లభించింది. కోరమాండల్‌కు విశాఖతోపాటు కాకినాడ, తమిళనాడులోని ఎన్నోర్, రాణిపేట్‌లో ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్ తయారీ కేంద్రాలున్నాయి. -
యాంత్రీకరణే అధిక దిగుబడికి పరిష్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ జనాభా 2040 నాటికి 900 కోట్లకు చేరుకోనుంది. వీరందరికీ సరిపడ ఆహారోత్పత్తి పెద్ద సవాల్ అని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ సమీర్ గోయల్ తెలిపారు. నేలల రకాన్నిబట్టి ప్రత్యేక పోషకాలు, యాంత్రీకరణ, నదుల అనుసంధానం, కరువును తట్టుకునే వంగడాలు అధిక దిగుబడికి పరిష్కారమని బుధవారమిక్కడ జరిగిన సీఐఐ సదస్సులో తెలిపారు. దున్నటం, పంట కోతలకు మాత్రమే యాంత్రికీకరణ పరిమితమవుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు అన్నారు. కరువు తట్టుకునే విత్తనాల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. బీటీ పత్తి విత్తనాలపై ఆధారపడడం తగ్గించే చర్యల్లో భాగంగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెరిగేలా వంగడాలను సృష్టించే పనిలో ఉన్నట్టు తెలిపారు. అనుమతులు మీరిచ్చి... కోరమాండల్ స్పాన్సర్ చేసిన సీఐఐ సదస్సుకు ఆ కంపెనీ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విత్తన కంపెనీలకు అనుమతులు ఇచ్చేది మీరు, నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ చర్యలు మాపైనా తీసుకోవడమేంటని మెదక్ ఫెర్టిలైజర్స్, సీడ్స, పెస్టిసైడ్‌స అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్ మోహన్తోసహా వేదిక పైన ఉన్నవారంతా ఖంగుతిన్నారు. యూరియా బస్తాలు తక్కువ బరువుతో వచ్చినా తయారీ కంపెనీలపై చర్య తీసుకోకుండా డీలర్లను బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృధా అవుతున్నా ప్రభుత్వ శాఖల నుంచి కొత్త వంగడాలు పెద్దగా రావడం లేదన్నారు. ఏడాదిలో విస్తరణ పూర్తి... వైజాగ్‌లో ఉన్న ఫాస్ఫారిక్ యాసిడ్ తయారీ యూనిట్‌ను కోరమాండల్ విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు సామర్థ్యం రోజుకు 700 టన్నులు. దీనిని 1,000 టన్నులకు చేర్చనున్నారు. విస్తరణకై డిసెంబరు 8న (నేడు) ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి రాగానే 12 నెలల్లో ప్లాంటు సిద్ధం చేస్తామని కంపెనీ మార్కెటింగ్ ప్రెసిడెంట్ జి.రవి ప్రసాద్ తెలిపారు. విస్తరణకు కంపెనీ రూ.225 కోట్లు వ్యయం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 275 మందికి ఉద్యోగాలు రానున్నాయి. -
సగానికి పడిన కోరమాండల్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలి తాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికర లాభం క్రితంతో పోలిస్తే సగానికి పడింది. నికర లాభం రూ.15 కోట్ల నుంచి రూ.8 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవర్ రూ.2,204 కోట్ల నుంచి రూ.2,059 కోట్లకు పడింది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ లాభం 35% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికర లాభం 35 శాతం పెరిగి రూ. 93 కోట్లుగా (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో కంపెనీ లాభం రూ. 69 కోట్లు. ఆదాయం రూ. 2,998 కోట్ల నుంచి రూ. 3,021 కోట్లకు పెరిగింది. మెరుగైన పనితీరుకు క్రిమిసంహారకాల వ్యాపార విభాగం దోహదపడిందని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎ. వేలాయన్ తెలిపారు. రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ.4 మేర తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 402 కోట్ల నుంచి రూ. 361 కోట్లకు తగ్గింది. -
55 శాతం తగ్గిన కోరమాండల్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం కాలంతో పోలిస్తే 55 శాతం తగ్గి రూ.14.47 కోట్లకు పడిపోయింది. టర్నోవరు 16 శాతం పెరిగి రూ.2,181 కోట్లకు చేరింది. ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఉన్న ఉదయ్ చందర్ ఖన్నాను కంపెనీ చైర్మన్‌గా నియమించింది. -
కోరమాండల్ లాభం రూ.402 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ 2014-15 కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే రూ.356 కోట్ల నుంచి రూ.402 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.10,053 కోట్ల నుంచి రూ.11,306 కోట్లకు ఎగసింది. క్యూ4లో రూ.2,997 కోట్ల టర్నోవర్‌పై రూ.68 కోట్ల నికర లాభం పొందింది. 2013-14 క్యూ4లో రూ.2,184 కోట్ల టర్నోవర్‌పై రూ.81 కోట్ల నికర లాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. -
కోరమాండల్ ఆదాయం @ 10 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువులు, సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.10 వేల కోట్ల మార్కును దాటింది. 2013-14 ఆర్థిక సంవత్సరం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.10,053 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టర్నోవరు రూ.9,034 కోట్లుంది. నికర లాభం 17 శాతం తగ్గి రూ.432 కోట్ల నుంచి రూ.356 కోట్లకు పడిపోయింది. మార్చి త్రైమాసికంలో నికర లాభం ఏకంగా రూ.12 కోట్ల నుంచి రూ.81 కోట్లకు ఎగబాకింది. టర్నోవరు రూ.2,079 కోట్ల నుంచి రూ.2,182 కోట్లను తాకింది. 2013-14కుగాను రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.4.50 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. ఫాస్పేటేతర ఎరువులు, కొత్త విభాగాలతో నాల్గవ తైమాసికంలో లాభం ఏడింతలైందని కోరమాండల్ ఎండీ కపిల్ మెహన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. మొత్తంగా చూస్తే అధిక పన్నులు, వడ్డీల మూలంగా 2013-14లో లాభం తగ్గిందన్నారు. రెండేళ్లలో ప్లాంటు.. వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉన్న యాన్మర్ అండ్ కో అనే జపాన్ కంపెనీతో ఇటీవలే కోరమాండల్ సంయుక్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. భాగస్వామ్య కంపెనీ దక్షిణాదిన ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నారు. కోరమాండల్ వాటా రూ.16 కోట్లు. ప్లాంటులో వరి నాటే యంత్రాలు, కోత యంత్రాలను తొలుత అసెంబ్లింగ్ చేస్తారు. రానున్న రోజుల్లో దేశీయంగా తయారీ చేపడతారు. రెండేళ్లలో ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. నౌకాశ్రయం సమీపంలో ప్లాంటు స్థాపిస్తామని, ఇంకా ఎక్కడ ఏర్పాటు చేసేది నిర్ణయించలేదని కంపెనీ తెలిపింది. కంపెనీ రిటైల్ విభాగమైన మన గ్రోమోర్ ఔట్లెట్లను ఫ్రాంచైజీ విధానంలోనూ పరిచయం చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో శంకర సుబ్రమణియన్ పేర్కొన్నారు. వ్యవసాయం సవాలే.. వచ్చే 10 ఏళ్లలో భారత్‌లో వ్యవసాయం పెద్ద సవాల్‌గా మారనుందని కపిల్ మెహన్ అన్నారు. ‘కార్మికులు వ్యవసాయం వదిలి కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి క్రమంగా అవకాశాలు పెరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి. సమస్య నుంచి బయటపడాలంటే వ్యవసాయంలో యాంత్రికీకరణ తప్పదు. యాంత్రికీకరణతో 10-15 శాతం అధిక ఉత్పాదకత నమోదవుతోంది’ అని కపిల్ మెహన్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం 5 శాతం లోపే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. -
తగ్గిన కోరమాండల్ నికర లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే తగ్గింది. నికర లాభం రూ.238 కోట్ల నుంచి రూ.164.5 కోట్లకు పడిపోయింది. ఆదాయం 20 శాతం పెరిగి రూ. 2,675 కోట్ల నుంచి రూ.3,215 కోట్లకు చేరింది. ఎరువుల సబ్సిడీ అందక పోవడం, వ్యయాలు తగ్గకపోవడం, రూపాయి పతనం తదితర కారణాల వల్లే లాభంపై ప్రభావం పడిందని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ కపిల్ మెహన్ తెలిపారు. సీఎఫ్‌వో ఎస్.సుబ్రమణియన్‌తో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దహెజ్ వద్ద మరో యూనిట్? : కోరమాండల్ అనుబంధ కంపెనీ అయిన సబేరో ఆర్గానిక్స్‌కు గుజరాత్‌లోని దహెజ్ వద్ద ప్లాంటు ఉంది. పంట రక్షణ ఉత్పత్తులను ప్లాంటులో తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది. కాగా, ఖరీఫ్ పంట దిగుబడి గణనీయంగా ఉండబోతోందని కపిల్ మెహన్ చెప్పారు.