హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు.
ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment