Fertilizer supply
-
ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధంచేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్లో ఆర్బీకేలలో ఎరువులు లేవన్న మాట వినిపించకూడదన్న లక్ష్యంతో రైతులు కోరుకున్న ఎరువులను అందించేలా ఏర్పాట్లుచేస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఆర్బీకేల ద్వారా 31.54 లక్షల మంది రైతులకు రూ.1,311.80 కోట్ల విలువైన 11.88 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయగా, రానున్న సీజన్లో కనీసం 10 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతులకు రూ.100 కోట్ల వరకు ఆదాసాగు ఉత్పాదకాల పంపిణీలో ఆర్బీకేలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎరువుల కోసం రైతులు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. అయినా అరకొరగానే అందేవి. ఒక్కోసారి సమయానికి దొరక్క బ్లాక్‌లో కొనాల్సి వచ్చేది. ఎరువుల వంకతో అవసరంలేని పురుగుల మందులను కొనాల్సి రావడం రైతులకు భారంగా మారేది. ప్రస్తుతం సర్టిఫై చేసిన ఎరువులను ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంచడంతో ఎరువు కోసం రైతులు ఇబ్బందిపడిన దాఖలాలు కన్పించలేదు. లోడింగ్, అన్లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అవుతోంది. ఇలా నాలుగేళ్లలో రూ.100 కోట్లకు పైగా రైతులకు ఆదా అయ్యింది. ఆర్బీకేలకు ఎరువుల లైసెన్సులు కేంద్రం కేటాయించిన ఎరువులను జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వచేసి అక్కడ నుంచి పీఏసీఎస్, ఆర్బీకేలకు సరఫరా చేయడానికి ఏటా రూ.70 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఈ భారాన్ని గత నాలుగేళ్లుగా ప్రభుత్వమే భరిస్తోంది. వచ్చే ఏడాది నిల్వ సామర్థ్యం పెరగనుండడంతో ఇందుకు కనీసం రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రతీ ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో వివిధ శాఖల పరిధిలో 1,864 గోదాములు, సచివాలయ ప్రాంగణాల్లో 3,979 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేలకు అనుబంధంగా 500 టన్నుల సామర్థ్యంతో రూ.493.15 కోట్లతో 1,167 గోదాములు నిరి్మస్తుండగా, వాటిలో 664 గోదాములు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేలకు ఎరువుల విక్రయ లైసెన్సులు జారీచేశారు. ఫలితంగా సమయంతో పాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలావరకు తగ్గే అవకాశాలున్నాయి. ఖరీఫ్–24కు 17.50 లక్షల టన్నులు ఎరువులు..ఇక ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా 37.79 లక్షల ఎకరాల్లో వరి, 14.48 లక్షల ఎకరాల్లో పత్తి, 13.88 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 5.85 లక్షల ఎకరాల్లో కందులు, 3.10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తుంటారు. ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇందులో 6.50 లక్షల టన్నుల యూరియా, 2.30 లక్షల టన్నుల డీఏపీ, ఏడు లక్షల టన్నుల కాంప్లెక్స్, లక్ష టన్నుల ఎస్ఎస్పీ, 70 వేల టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేశారు. మరోపక్క.. ఇఫ్కో ద్వారా 5 లక్షల నానో యూరియా, 2 లక్షల నానో డీఏపీ బాటిల్స్ సరఫరాకు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల్లో కనీసం 5.60 లక్షల టన్నులు ఆర్బీకేల ద్వారా సరఫరాకు ప్రణాళిక సిద్ధంచేసారు. -
ఈనాడు చావు తెలివి..
సాక్షి, అమరావతి: ప్రపంచం మొత్తం వేనోళ్ల కీర్తిస్తున్న ఆర్బీకే వ్యవస్థను అప్రదిష్టపాల్జేయడం, రైతులకు అండగా నిలుస్తూ వారిని చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకే సిబ్బందిపై ఇప్పుడు రామోజీ కన్నుపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆయన ఈసారి వారి మనోస్థైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓ ఆర్బీకే సిబ్బంది మరణాన్ని సైతం రాజకీయం చేస్తూ చావు తెలివితేటలను ప్రదర్శించింది. వ్యక్తిగత కారణాలతో ఆర్బీకే ఉద్యోగిని ఒకరు బలవన్మరణానికి పాల్పడితే, దాన్ని వక్రీకరిస్తూ ‘ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు’ అంటూ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టారాజ్యంగా అబద్ధాలను అచ్చేసింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’ ఏమిటంటే.. బకాయిలపై ఎలాంటి ఒత్తిడిలేదు బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి–1 ఆర్బీకేలో గ్రామ వ్యవసాయ సహాయకురాలుగా మూడున్నరేళ్ల నుంచి సమర్థవంతమైన సేవలందిస్తున్న బి.పూజిత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు ఏమైనప్పటికీ ఆమె మరణం బాధాకరం. కానీ, ఎరువుల బకాయిలపై ప్రభుత్వాధికారులు ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ ఈనాడు చేసిన ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి.. ఈ ఆర్బీకే ద్వారా రైతులకు సరఫరా చేసిన ఎరువులకు సంబంధించిన బకాయిలు అక్షరాల కేవలం రూ.16 మాత్రమే. ఈ కొద్దిపాటి సొమ్ము కోసం ఒత్తిడి తీసుకొచ్చారనడం ఎంతో హాస్యాస్పదం. ఆర్బీకేలో నిల్వచేసిన తడిసి, పాడైన ఎరువుల తాలూకు విలువను ఆర్బీకే సిబ్బంది నుంచి వసూలు కోసం ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈనాడు మరో ఆరోపణ చేసింది. నిజానికి.. వర్షాలు, ఇతర వైపరీత్యాల సందర్భంలో తడిసిన, గడ్డకట్టిన, పాడైన ఎరువులను సంయుక్త విచారణ ద్వారా నిర్ధారించి వాటిని రద్దుచేసి, ఆ మేరకు సొమ్మును బకాయిల నుంచి మినహాయిస్తున్నారే తప్ప ఏ ఒక్క ఆర్బీకే నుంచి వసూలుచేసిన దాఖలాల్లేవు. ఇప్పటివరకు సంయుక్త విచారణలో ఇలా వైపరీత్యాలవల్ల పాడైనట్లుగా గుర్తించిన రూ.8.4 లక్షల విలువైన 15 టన్నుల ఎరువులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సకాలంలో అద్దె జమ.. ఇక ఆర్బీకే అద్దెల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లు ఖర్చుచేసింది. రానున్న మార్చి వరకు సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాల్లో జమచేశారు. పెండింగ్‌లో విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా, ఇక నుంచి నేరుగా ఈ బడ్జెట్‌ను విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా ఇప్పటికే ఖర్చుచేసిన సిబ్బందికి రూ.53.48 లక్షలు విడుదల చేశారు. ఇంటర్నెట్ కోసం కూడా రూ.23 కోట్లు విడుదల చేశారు. ఇలా రైతుల అవసరాలను తీరుస్తూ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్న ఆర్బీకేలపై నిత్యం అదే పనిగా బురద జల్లడం, సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీసేలా దుర్మార్గపు రాతలు రాస్తోంది. ఈ క్షుద్ర పాత్రికేయాన్ని ఇకనైనా మానుకోవాలని రైతులు ఈనాడు రామోజీకి సూచిస్తున్నారు. ఆర్బీకేల్లో ఎరువుల విక్రయం వ్యాపారం కాదు.. ఇక రైతుభరోసా కేంద్రాల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామస్థాయిలో చేసిన ఓ సదుపాయం మాత్రమే. నిజానికి.. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07 లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా.. మూడో ఏడాదికి వచ్చేసరికి అది నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.90 లక్షల మందికి చేరింది అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది. గ్రామస్థాయిలో ఎమ్మారీ్పకే ఎరువులు అందుబాటులో ఉంచడంతో.. బ్యాగ్‌పై రూ.20–50 వరకు రవాణ, లోడింగ్, అన్లోడింగ్ భారం తగ్గడంతో రైతులు ఆర్బీకేల ద్వారా ఎరువులు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ–క్రాప్ నమోదులోనూ ఒత్తిడి లేదు.. మరోవైపు.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉమ్మడి అజమాయిషీ కింద జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కోసం టైమ్‌లైన్ నిర్దేశించారే తప్ప సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడిలేదు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఖరీఫ్ 2023 నుండి జియో ఫెన్సింగ్ అమలుచేస్తున్నారు. ఆర్బీకే సిబ్బంది అభ్యర్థన, ఫీడ్‌బ్యాక్ మేరకు వరి పంటకు జియో ఫెన్సింగ్‌ను 20 నుంచి 200 మీటర్లకు పెంచడమే కాదు.. అవసరమైతే క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మినహాయింపు కూడా ఇస్తున్నారు. అలాగే.. వైఎస్సార్ రైతుభరోసా మాస పత్రిక కోసం ఇప్పటివరకు 14,300 మంది రైతులు స్వచ్ఛందంగా బుక్ చేసుకున్నారు. ఈ విషయంలో సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారనడంలో కూడా ఎలాంటి వాస్తవంలేదు. -
ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి
హోమ్మేడ్ ఎరువు ►గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం, స్పూను వంటసోడా వేసి కలపాలి. తరువాత అర టీస్పూను వెనిగర్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. జీవం కోల్పోయిన మొక్కలపై ఈ ద్రావణాన్ని చిలకరిస్తే.. మొక్కలు పచ్చగా కళకళలాడతాయి. ► ఉల్లిపాయ ముక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లు, సోయాబీన్ నీళ్లు, బీరు కలిపిన నీళ్లు కూడా మొక్కలకు బలాన్ని అందించి చక్కగా పెరిగేలా చేస్తాయి. ► కప్పు వేడినీటిలో స్పూను పంచదార, స్పూను వంట సోడా, స్పూను వెనిగర్ వేసి కలపాలి. కప్పు మీద మూత పెట్టి ఉంచాలి. 48 గంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోస్తే వేళ్లకు బలం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు. -
Fact Check: ఆర్బీకేలపై ఎందుకంత అక్కసు!?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు చేస్తున్న మంచి ఏదీ రామోజీరావుకు కనిపించదు. కనిపించినా కనిపించనట్లు.. చూసినా చూడనట్లు నటిస్తారు. ఎందుకంటే.. అధికారంలో ఆయన ఆత్మబంధువు చంద్రబాబు లేడు కాబట్టి. ఆయనే కనుక ఉంటే ఆయనెన్ని తప్పులు చేసినా అవి సూపర్‌గానే కనిపిస్తాయి. తన జర్నలిజం మార్కు ఇదేనని రామోజీ నిత్యం నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా ఆదివారం సంచికలో ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ అంటూ రైతుభరోసా కేంద్రాలపై రామోజీ నిస్సిగ్గుగా విషం కక్కిన తీరు ఈ కోవకు చెందినదే. వైఎస్సార్ రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాలు.. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుంటే.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే ఈనాడుకు కంటిమీద కునుకు కరువైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, రైతుల అభ్యున్నతికి అవి పాటుపడుతూ నాలుగేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో స్పష్టమైన మార్పునకు నిలువెత్తు నిదర్శనంగా కళ్లెదుట సాక్షాత్కరిస్తుండడంతో పచ్చ మీడియాకు దిక్కుతోచడంలేదు. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు విస్తృతమైన సేవలందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి.. ఆ వ్యవస్థే వృధా అన్నట్లుగా నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది ఈనాడు. నిజానికి.. రబీ సీజన్ కోసం ముందస్తుగా ఓ వైపు ముమ్మరంగా విత్తన పంపిణీ జరుగుతోంది.. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.. పురుగు మందుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయినా అవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఎక్కడా ఏ ఒక్క రైతు తమకు విత్తనం అందడంలేదని కానీ, ఎరువు దొరకడం లేదంటూ కనీసం ఫిర్యాదు కాదు కదా రోడ్డెక్కిన పాపాన కూడా పోలేదు. ఆర్బీకేలకు వస్తున్న ఈ ఆదరణను చూసి ఓర్వలేక రామోజీ కల్లుతాగిన కోతిల వెర్రెక్కిపోతున్నారు. ‘ఇదా భరోసా సిగ్గు.. సిగ్గు’ కథనంపై ‘ఫ్యాక్ట్‌చెక్’ చదవండి.. ఆరోపణ: నామమాత్రమైన ఆర్బీకేలు.. వాస్తవం: రైతులకు గ్రామస్థాయిలో సకాలంలో సమర్థవంతమైన, నాణ్యమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఆర్బీకేలు రైతుల ఆదరణ చూరగొంటున్నాయి. గతంలో వ్యయప్రయాల కోర్చి మండల కేంద్రాలకు వెళ్లి ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని విత్తనాలను, ఎరువులను పురుగుల మందుల కోసం పడిగాపులు కాస్తే కాని దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం చూద్దామంటే నాలుగేళ్లలో క్యూలైన్ అనేది కన్పించలేదు. పైగా గతంలో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులైన భూస్వాములు, రైతులకు పంచగా, మిగిలినవి సన్న, చిన్నకారు రైతులకు విదిల్చేవారు. ప్రస్తుతం వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు అవసరమైన మేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఆరోపణ: పురుగు మందుల జాడేది? వాస్తవం: ఆర్బీకేల ద్వారా మూడేళ్లలో 1,50,822 మంది రైతులకు రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్ కోసం సర్టిఫై చేసిన సస్యరక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లుచేస్తున్నారు. ఇంతవరకు పురుగు మందులను కేవలం వివిధ పథకాల కింద మాత్రమే పంపిణీ చేయగా, 2023 రబీకాలం నుంచి ఎరువుల మాదిరిగా పురుగు మందులను కూడా సాధారణ పద్ధతిలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇవేమీ రామోజీకి కన్పించడంలేదు. ఆరోపణ: అక్కరకు రాని ఆర్బీకేలు.. వాస్తవం: నిజానికి.. ఆర్బీకేల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. కేవలం సాగు ఉత్పాదకాలు రైతు ముంగిట అందించడమే కాదు.. సర్టిఫై చేసిన నాణ్యమైన ఉత్పాదకాల పంపిణీతో పాటు రైతుల్లో సామర్థ్యం పెంపు, పరిశోధనా ఫలాలు రైతు క్షేత్రాలకు చేరవేయడం, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ–క్రాప్ బుకింగ్, రైతు సంక్షేమ పథకాల అమలులో ఆర్బీకేలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 45,226 కోట్ల విలువైన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను 26.55 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు ఈనాడుకు కన్పించకపోవడం విడ్డూరం. ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద బహిరంగ మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా కృషిచేస్తున్నారు. ఆరోపణ: ఆర్బీకేలకు రూ.మూడువేల కోట్లు వెచ్చించినా.. వాస్తవం: రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేయగా, వాటిలో 542 గ్రామాల్లో సొంత భవనాలుండగా 10,236 ఆర్బీకే భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిలో 3,947 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 2,948 భవనాలను ఇప్పటికే వ్యవసాయ శాఖకు అప్పగించారు. మరో 5,212 భవనాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 1,077 భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు భవనాల కోసం రూ.944 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.343 కోట్లు ఖర్చుచేశారు. కియోస్క్‌ల పనితీరును ప్రత్యేక డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏపీ ఫైబర్‌నెట్, మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కియోస్క్‌లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. 94 శాతం కియోస్క్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. రెండు విడతల్లో నియమించిన 6,246 వ్యవసాయ, 4,655 పశుసంవర్థక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులతో పాటు అనుభవజ్ఞులైన బహుళార్ధ, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గోపాలమిత్రలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు ఓ వలంటీర్‌తోపాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. ఆరోపణ: ఎరువుల అమ్మకాలు తూచ్.. వాస్తవం: ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదని, రైతులకు గ్రామస్థాయిలో కల్పించిన ఓ సదుపాయం మాత్రమే. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50 శాతం వ్యాపారులకు, మిగిలిన 50 శాతం సహకార కేంద్రాలు, ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటుచేసిన తొలి ఏడాది 1.07లక్షల టన్నుల అమ్మకాలు జరగ్గా, మూడో ఏడాదికి వచ్చేసరికి అది దాదాపు నాలుగు లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020–21లో 2.55 లక్షల మంది ఉంటే, 2022–23లో ఏకంగా 10.89 లక్షల మందికి చేరింది. అంటే.. 428 శాతం వృద్ధి కన్పిస్తోంది. అలాగే, ఇప్పటివరకు రూ.1,196.07 కోట్ల విలువైన 10.83 లక్షల టన్నుల ఎరువులను 28.95 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. 2023–24లో ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 5.48 లక్షల మంది రైతులకు 2.13 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, ఆర్బీకేల వద్ద 80వేల టన్నులు, సొసైటీల వద్ద 36 వేల టన్నుల ఎరువులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. రైతు ముంగిట ఎమ్మార్పీకే అందుబాటులో ఉండడంతో బ్యాగ్‌పై రూ.20 చొప్పున ఈ నాలుగేళ్లలో రూ.50 కోట్లకు పైగా ఆదా అయ్యింది. ఇక సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీవల్ల నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్ పడింది. ఆరోపణ: విత్తనాలు దొరకవు.. వాస్తవం: సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను రైతులు బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారికి అందిస్తున్నారు. ఇలా ఈ నాలుగేళ్లలో 55.72 లక్షల మంది రైతులకు రూ.881.47 కోట్ల విలువైన 30.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై ఆర్బీకేల ద్వారా మాత్రమే పంపిణీ చేశారు. అంతేకాదు.. రూ.12.75 కోట్ల విలువైన మిరప, పత్తి, మొక్కజొన్న వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆరోపణ: ఆర్బీకేలకు గుర్తింపేది? వాస్తవం: ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటై మూడున్నరేళ్లు కావస్తోంది. అనతికాలంలోనే ఆర్బీకేలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు పొందాయి. అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖ, నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలందుకున్నాయి. యూఎన్ చాంపియన్ అవారు్డకు నామినేట్ అయ్యాయి. ఆర్బీకే స్ఫూర్తితో జాతీయస్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఆర్బీకే సాంకేతికత కోసం పొరుగు రాష్ట్రాలే కాదు.. దేశ, విదేశాలు సైతం పోటీపడుతున్నాయి. ఇథియోపియా వంటి ఆఫ్రికన్ దేశం ఆర్బీకే సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఇలా ఆర్బీకేలు ఇన్ని వసతులను కల్పించి రైతుకు భరోసా ఇచ్చినా.. ఆర్బీకే వ్యవస్థను సిగ్గు సిగ్గు అని తక్కువ చేసి చూపడం రామోజీకే చెల్లింది. -
ఊపందుకున్న మిరప సాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిరప సాగు ఊపందుకుంటోంది. సీజన్ ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోయినప్పటికీ.. గడచిన రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరట ఇస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం దిశగా మిరప సాగు పయనిస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటం.. పెరిగిన ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు మిరప పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 4.87 లక్షల ఎకరాలు కాగా.. 50 శాతం వర్షాధారం కింద, మరో 50 శాతం బోర్ల కింద సాగవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరగడంతో మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. నాలుగేళ్లలో కనిష్ట ధర 3 రెట్లు పెరిగితే.. గరిష్ట ధర రెట్టింపు దాటింది. ఫలితంగా మిరప సాగు ఏటా విస్తరిస్తోంది. 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవగా.. 11.50 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 2023–24 ఖరీఫ్ సీజన్లో 5.67 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించగా.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరల ఫలితంగా 6.50 లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా. దిగుబడులు సైతం 12 లక్షల టన్నులు దాటుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా అన్ని సేవలు ఆర్బీకేల ద్వారా సర్టీఫై చేసిన నాణ్యమైన డిమాండ్ ఉన్న మిరప సీడ్ రైతులకు అందుబాటులో ఉంది. ఎరువులు, పురుగుల మందుల కొరత లేకుండా సీజన్ ముందు నుంచే ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. నల్లతామరతో పాటు ఇతర చీడపీడలు, తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడటం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా తోట బడులు నిర్వహిస్తూ రైతులకు శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుకు ఊరటనిస్తోన్న వర్షాలు మిరప రైతులు సాధారణంగా జూన్, జూలైలో నారు పోస్తారు. అక్టోబర్ వరకు నాట్లు వేస్తారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు మిరప రైతులను ఒకింత కలవరపాటుకు గురి చేశాయి. బోర్ల కింద ఇబ్బంది లేనప్పటికీ వర్షాధారం కింద పండించే చోట్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఆగస్టు నెలాఖరు నుంచి కురుస్తున్న వర్షాలు మిరప రైతులకు ఊరటనిచ్చాయి. కనీసం సాధారణ విస్తీర్ణంలోనైనా సాగవుతుందో లేదో అనే ఆందోళన చెందిన అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే నిర్ధేశించిన సాగు విస్తీర్ణం అధిగమించడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం 3.50 లక్షల ఎకరాల్లో మిరప నాట్లు పడగా.. ఇదేరీతిలో వర్షాలు కురిస్తే సీజన్ ముగిసే నాటికి 5.50 లక్షల నుంచి 6 లక్షల ఎకరాలు దాటుతుందని చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే 5 లక్షల నుంచి 5.50లక్షల ఎకరాలకు పరిమితమవుతుందని, దిగుబడులు మాత్రం 11 నుంచి 12 లక్షల టన్నుల మధ్య ఉంటుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మరీ మిరప రైతులు సాగు చేస్తున్నారు. ఆగస్టులో వర్షాభావ పరిస్థితులను చూస్తే ఈసారి సాధారణ విస్తీర్ణం కూడా దాటలేం అనుకున్నాం. కానీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మిరప సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేటట్టు ఉన్నాయి. అక్టోబర్ నెలాఖరు వరకు ఇదే రీతిలో వర్షాలు కురిస్తే విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎస్ఎస్.శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫెర్టిలైజర్స్ సిటీగా జాతీయ స్థాయిలో పేరొందిన కాకినాడ నగరం మరో కొత్త ఆవిష్కరణకు వేదిక కాబోతోంది. ఇకపై నానో ఎరువుల ఉత్పత్తికి సైతం కేంద్ర బిందువు కాబోతోంది. కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఈ దిశగా అడుగులు వేస్తోంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్) ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ సిటీగా కాకినాడ పేరొందింది. అనంతరం తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూపు కాకినాడ జీఎఫ్సీఎల్ను టేకోవర్ చేసి కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ప్లాంట్‌ను విస్తరించడంతోపాటు నానో ఎరువులను ఉత్పత్తి చేసేందుకు కోరమాండల్ ముందుకొచ్చింది. 3 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నులకు.. ఏటా 3 లక్షల టన్నుల డీఏపీ ఉత్పత్తి సామర్థ్యంతో 1988లో ఈ పరిశ్రమను కోరమాండల్ ప్రారంభించింది. దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం ఏటా 20.50 లక్షల టన్నుల డీఏపీ, పొటా‹Ù, ఇతర ఎరువులను ఉత్పత్తి చేస్తోంది. ఇకపై ఏటా ఉత్పత్తిని 30 లక్షల టన్నులకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నానో ద్రవ రూప ఎరువులను ఏటా 30 వేల కిలోలీటర్లు మేర ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువుల దిగుమతిని తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ వాకలపూడిలోని కోరమాండల్ ప్లాంట్‌ను రూ.710 కోట్లతో విస్తరించేందుకు కోరమాండల్ ప్రతిపాదించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నానో ఎరువులు, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఎరువుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి సేకరించింది. ఇప్పుడున్న 4.80 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ఉత్పత్తితో కలిపి 12 మెగావాట్ల క్యాప్టివ్ వపర్ ప్లాంట్‌ను కూడా ప్రతిపాదించారు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా విస్తరణ ప్లాంట్‌లో ఉపాధి అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్లాంట్ విస్తరణకు అన్ని అనుమతులు వచ్చేసరికి నాలుగైదు నెలల సమయం పడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నానో డీఏపీ, ఇతర ఎరువుల ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. నానో డీఏపీతో తగ్గనున్న ఖర్చు రైతులు గుళికల రూపంలో ఉండే ఎరువులను వ్యవసాయ క్షేత్రాల్లో చల్లుతున్నారు. ఆ ఎరువులు నీటిలో కరిగిపోయి భూమి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తాయి. ఒక బస్తా డీఏపీ ఉత్పత్తికి సుమారు రూ.3,200 ఖర్చవుతోంది. డీఏపీపై కేంద్రం ఒక్కో బస్తాపై రూ.2 వేల సబ్సిడీ ఇస్తోంది. రైతు బస్తా రూ.1,200కు కొనుగోలు చేస్తున్నాడు. అదే బస్తా డీఏపీ బదులుగా ఒక లీటరు నానో డీఏపీ సరిపోతుంది. దీని ఉత్పత్తి వ్యయం రూ.700 నుంచి రూ.800 అవుతుంది. డ్రోన్ ద్వారా కూడా దీనిని పొలాల్లో నేరుగా పిచికారీ చేసుకోవచ్చు. నానో ఎరువులు పర్యావరణానికి పూర్తిగా అనుకూలం. ద్రావణం నేరుగా మొక్క కాండానికి చేరుతుంది. భూమిలోని వానపాములు చనిపోవు. రైతుకు భారం తగ్గుతుంది. నానో ఎరువు అద్భుతమైన అవకాశం నానో ఫెర్టిలైజర్ అనేది సుస్థిరమైన వ్యవసాయ విధానాలలో అద్భుతమైన అవకాశం. కోరమాండల్ ఇంటర్నేషనల్ పరిశోధన కేంద్రం, ఐఐటీ ముంబై సహకారంతో నానో సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. 2024 ప్రథమార్థంలో నానో డీఏపీ అందుబాటులోకి వస్తుంది. – సాయిభాస్కర్, సాంకేతిక సలహాదారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ కేంద్రానికి నివేదిక పంపించాం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్యాక్టరీ విస్తరణకు ప్రతిపాదనలు వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాం. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నుంచి వచ్చి న విజ్ఞాపనలను పరిశీలించాం. ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – కృతికా శుక్లా, కలెక్టర్, కాకినాడ -
ఎరువుల ప్రణాళిక ఖరారు...
సాక్షి, హైదరాబాద్: రాబోయే వానాకాలం సీజన్లో 24.60 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎరువుల ప్ర ణాళికను ఖరారు చేసింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం కేటాయించిన ఎరువులు వానాకాలం సీజన్‌కు పూర్తిస్థాయిలో సరిపోతాయని తెలిపాయి. ఎరువుల్లో అత్యధికంగా 9.50 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా కేటాయించారు. 9.40 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ, 1.25 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, లక్ష మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను కేటాయించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. కాగా, ఏడాదికేడాదికి యూరియా వాడకం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చరొట్ట విత్తనాలను సరఫరా చేయడం వల్ల, గతం కంటే ఐదారు వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం తగ్గుతోందంటున్నారు. మండలాలకు ఎరువుల సరఫరా... వచ్చే నెల మొదటి వారంలో వానాకాలం సీజన్ ప్రారంభం కానుంది. ఒక వర్షం పడితే చాలు రైతులు దుక్కులు దున్నుతారు. దీంతో ముందస్తుగా మొదటి దఫా ఎరువులను మండలాలకు సరఫరా చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మండలాల్లోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), ఆగ్రోస్ రైతు సే వా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశా రు. రైతులకు ఎరువులు నిత్యం అందుబాటు లో ఉండేలా చూడాలని ప్యాక్స్, రైతు సేవా కేంద్రాలను వ్యవసాయశాఖ ఆదేశించింది. ఎరు వుల కొరత రాకుండా, ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఎరువులను రేక్ పాయింట్ల నుంచి రవాణా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీలను ఎంపిక చేసింది. మొత్తం 20 రేక్ పాయింట్ల నుంచి ఎరువులను తీసుకెళ్లేందుకు మూడు ఏజెన్సీలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒక ఏజెన్సీకే 18 రేక్ పాయింట్లు వచ్చాయి. మిగిలిన రెండు రేక్ పాయింట్లు మరో రెండు ఏజెన్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఎరువుల రవాణా కోసం రూ. 96 కోట్లు ఖర్చు కానుంది. -
పాలీహౌస్‌ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్‌తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
అరువుపై ఎరువులు ఇవ్వం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ)లకు అరువుపై ఎరువులు ఇచ్చేది లేదని మార్క్‌ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఈ వానాకాలం సీజన్ నుంచి ముందు నగదు చెల్లించిన సొసైటీలకే ఎరువులు పంపుతామని తేల్చిచెబుతోంది. ఏటా సహకార సంఘాలు అరువుపై ఎరువులు తీసుకుని వాటిని రైతులకు విక్రయించి.. వచ్చిన డబ్బును మార్క్‌ఫెడ్‌కు చెల్లిస్తుంటాయి. ఇకమీదట ఉద్దెరపై ఎరువులు అమ్మరాదని మార్క్‌ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా చితికిన సహకార సంఘాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎరువులు కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని సొసైటీల చైర్మన్లు తర్జనభర్జన పడుతున్నారు. బ్యాంకు గ్యారెంటీతోనైనా ఇవ్వాలని వినతి ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం బ్యాంకు గ్యారెంటీలతోనైనా సొసైటీలకు ఎరువులు పంపాలని సొసైటీల పాలకవర్గాలు మార్క్‌ఫెడ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికోసం ఆయా జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫార్సు లేఖలను కూడా పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలా ఐదు సొసైటీలు బ్యాంకు గ్యారెంటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, సొసైటీలకు గ్యారెంటీ ఇచ్చేందుకు బ్యాంకులు కూడా అనేక మెలికలు పెడుతున్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద పాత బకాయిలన్నీ చెల్లించినట్లు నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. దీంతో సొసైటీల పాలకవర్గాలు నో డ్యూ సర్టిఫికెట్లకోసం మార్క్‌ఫెడ్ డీఎంలకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో 40 శాతం సొసైటీలు రాష్ట్రంలో మొత్తం 818 సహకార సంఘాలుండగా, ఇందులో సుమారు 40 శాతం సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొన్ని సొసైటీలైతే కనీసం సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన సొసైటీల ఆర్థిక పరిస్థితి మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. ఈ కొనుగోళ్లపై వచ్చిన కమీషన్‌తోనే చాలా వరకు సొసైటీలు నిలదొక్కుకుంటున్నాయి. ధాన్యం సేకరణ లేని ప్రాంతాల్లో సొసైటీలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఎరువుల పంపిణీలో కీలక పాత్ర.. ఎరువుల పంపిణీలో సొసైటీలది కీలక పాత్ర. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఎరువులు సొసైటీల ద్వారానే రైతులకు పంపిణీ అవుతున్నాయి. మిగతా 40 శాతం ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటారు. రైతులకు సొసైటీల్లో ఎరువులు అందుబాటులో ఉంటే ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి చెక్ పడు తుంది. సొసైటీల్లో ఎరువులు అందుబాటులో లేని పక్షంలో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువు దోపిడీ చేస్తారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సాగు పనులు ఊపందు కుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎరువులు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సగానికిపైగా సొసైటీల్లో ఈ వానాకాలం సీజన్లో ఎరువులు అందించే అవకాశం కనిపించడం లేదు. -
జిల్లాలకు 4.20 లక్షల టన్నుల యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో వారంలో వ్యవసాయ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో అధికారులు ఎరువుల సరఫరా ప్రారంభించారు. ఈ సీజన్లో 25 లక్షల టన్నుల ఎరువులు అవసర మవగా అందులో 10 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్ప టికే అన్ని జిల్లాలకు కలిపి 4.20 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మార్క్‌ఫెడ్ 2.13 లక్షల యూరియా నిల్వలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే 11,857 టన్నుల డీఏపీ, 41,540 టన్నుల కాంఫ్లెక్స్ ఎరువులు బఫర్ స్టాక్‌లో ఉన్నట్లు మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడిం చాయి. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా సిద్ధం గా ఉండాలని మార్క్‌ఫెడ్‌ను వ్యవసాయశాఖ ఆదేశించింది. వానాకాలం సీజన్లో ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణపై వ్యవసాయశాఖ మార్గదర్శకాలు తయారు చేసింది. మార్గదర్శకాలు ఇవీ.. ♦రిటైల్ డీలర్లకు రెండు ట్రక్కుల కంటే ఎక్కువగా ఎరువులను కేటాయించకూడదు. ♦ఏదో ఒక కంపెనీ లేదా బ్రాండ్లకు చెందిన వాటిని ప్రోత్సహించేలా జిల్లా వ్యవసాయా ధికారులు వ్యవహరించకూడదు. ♦అంతర్రాష్ట్ర అనధికారిక ఎరువుల సరఫరాను అడ్డుకోవాలి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలి. ♦ప్రతి నెలా మొదటి వారంలో ఎరువుల డీలర్ల సమావేశాన్ని జిల్లా వ్యవసాయాధికారి నిర్వహించాలి. ♦ఎరువుల లైసెన్సులను మాన్యువల్ ప్రాతి పదికన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు జారీచేయకూడదు. ♦జిల్లాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేసే వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. -
Ukraine Russia Conflict: ముంచుకొస్తున్న కొరత!.. మేలుకోకుంటే అనర్థమే
Russia-Ukraine War: ప్రపంచ ఎరువుల కొరతకు రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం ఆజ్యం పోయనుందని ప్రముఖ వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, వంటచమురు ధరలకు రెక్కలు వచ్చాయి. త్వరలో ఈ ప్రభావం ప్రపంచ ఆహార వ్యవస్థపై పడుతుందని ఆందోళనలున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడుతుందని, దీంతో ఒక్కమారుగా వీటి ధరలు పెరిగి పంట ఉత్పత్తి భారీగా క్షీణిస్తుందని జాన్ హామండ్, వైయోర్గోస్ గడ్నాకిస్ అనే ఆహార శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణంలోని నత్రజనిని హైడ్రోజన్‌తో సంయోగం చెందించడం ద్వారా అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఎరువుల ఉత్పత్తిలో అమ్మోనియాది కీలక స్థానం. అమ్మోనియా తయారీకి భారీగా శక్తి అవసరపడుతుంది. అంటే ఇంధన ధరల పెరుగుదల అమ్మోనియా ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే అమెరికాలో అమ్మోనియం నైట్రేట్ ధర టన్నుకు 650 నుంచి వెయ్యి డాలర్లకు పెరిగింది. ఇంతవరకు ఒక్క కిలో నైట్రోజన్ ఎరువు వాడిన పొలంలో సుమారు 6 కిలోల దిగుబడి వస్తే ఖర్చులు పోను లాభం మిగిలేది. కానీ ఎరువు ధర పెరగడంతో ఇప్పుడు లాభం రావాలంటే ఒక్క కిలో ఎరువు వాడకానికి 10 కిలోల పంట రావాల్సిఉంటుందని అంచనా. అలాగని ఎరువులు తక్కువగా వాడితే దాని ప్రభావం దిగుబడి, నాణ్యతపై పడుతుంది. ఈ పరిస్థితి రైతును అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తోందని జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: జపాన్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ వచ్చే సీజన్ నుంచి ప్రభావం ఉక్రెయిన్ సంక్షోభ ఫలితంగా ఇంధన ధరలు పెరిగిన ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై వచ్చే పంట సీజన్లో కనిపిస్తుందని పరిశోధకుల అంచనా. అప్పటికి ముందే కొనుగోలు చేసిన ఎరువులు రైతుల వద్ద అయిపోవడంతో కొత్తగా ఎరువుల కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పటికి ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగి ఉంటాయి. దీనివల్ల రైతు తక్కువగా ఎరువులు కొనుగోలు చేయడం జరగవచ్చని, ఇది కమతంలో పంట దిగుబడి తగ్గడానికి దారితీస్తుందని జాన్ విశ్లేషించారు. ప్రపంచ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్ధాల సరఫరా అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి జరుగుతుంది. యూరప్‌లో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారైన యారా కంపెనీ అవసర ముడిపదార్థాలను ఉక్రెయిన్ నుంచి కొం టుంది. సంక్షోభం కారణంగా ఉక్రెయిన్ పతనమవ డం, రష్యాపై ఆంక్షలు విధించడం ముడిపదార్ధాల సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. బెలారస్, రష్యాలు ప్రపంచ పొటాషియం ఉత్పత్తిలో మూడోవంతును ఉత్పత్తి చేస్తున్నాయి. ఎరువుల తయారీలో పొటాషియం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: దాడులు ఆపండి.. రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు ఆహార భద్రత ఎరువుల ఉత్పత్తి తగ్గడం తత్ఫలితంగా ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గడం కలిసి అంతిమంగా ప్రపంచ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయని జాన్, వైయోర్గోస్ అంచనా వేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ ఆహార భద్రత విషమంగా మారింది. 2019లో ప్రపంచ జనాభాలో 9 శాతం మంది కరువు కోరల్లో ఉన్నారు. కరోనా ప్రభావంతో వీరి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఎరువుల కొరత కారణంగా ప్రపంచ ఆకలి కేకలు మరింతగా పెరగనున్నాయి. ప్రభుత్వాలు తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే చాలామంది కరువు రక్కసికి బలికాక తప్పదని నిపుణుల హెచ్చరిక. ప్రజలను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు ముందుగా మేలుకొని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టడం, దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడం, పేదరిక రేఖకు దిగువన ఉన్నవారికి తగినంత ఆహార భద్రత కల్పించడం, సరిపడా ఆహారధాన్యాలను సమీకరించి నిల్వ చేసుకోవడం తదితర చర్యలు చేపట్టాలని సూచించారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఏపీకి 19.02 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్–2022 సీజన్లో ఏపీకి రూ.19.02 లక్షల టన్నుల ఎరువులను కేటాయించనున్నట్టు కేంద్ర, వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజ వెల్లడించారు. ఖరీఫ్ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లతో సోమవారం ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పంటలు, భూసార పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్లుగా ఎరువుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. వరి సాగు లక్ష్యం 16.33 లక్షల హెక్టార్లు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 57.32 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా వరి 16.33 లక్షల హెక్టార్లు, వేరు శనగ 7.30 లక్షల హెక్టార్లు, పత్తి 6.24 లక్షల హెక్టార్లు, కంది 2.70 లక్షల హెక్టార్లు, మినుము లక్ష హెక్టార్లు, పెసర 14 వేల హెక్టార్లు, జొన్న 17 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.16 లక్షల హెక్టార్లు, నువ్వులు 13 వేల హెక్టార్లు, రాగి 26 వేల హెక్టార్లు, మిరప 1.80 లక్షల హెక్టార్లు, కూరగాయలు 2.65 లక్షల హెక్టార్లు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 57.32 లక్షల హెక్టార్లుగా అంచనా వేశామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 79.8 శాతం నేలల్లో నత్రజని, 15.80 శాతం నేలల్లో భాస్వరం, 14.71 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్ లభ్యత తక్కువగా ఉన్న విషయాన్ని భూసార పరీక్షల్లో గుర్తించినట్టు కమిషనర్ తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రానికి యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ 2.25 లక్షల టన్నులు, ఎంవోపీ 1.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 6.41 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 95 వేల టన్నులు.. మొత్తం 19.02 లక్షల టన్నులు అవసరమని కమిషనర్ కోరగా.. ఆ మేరకు ఏపీకి ఎరువులను కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజలు ప్రకటించారు. -
ఎరువులు ఫుల్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, యూరియా సహా అన్నిరకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. గుంటూరులోని చుట్టుగుంటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద ప్రస్తుత రబీకి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఉన్నట్టు సాగుతున్న అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ముందస్తు ప్రణాళిక మేరకు ఎరువుల నిల్వలు ఉంచామన్నారు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో యూరియా కొరత ఉన్నట్టు మీడియా ద్వారా తెలిసిందని, అక్కడ అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 15 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయం రబీ అవసరాలకు 23.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల పంపిణీకి ప్రణాళికలు వేశామని అరుణ్‌కుమార్ తెలిపారు. ఇందులో యూరియా 9 లక్షల టన్నులని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1వ తేదీ నాటికి 6.97 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి రాష్ట్రానికి 12.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని చెప్పారు. ఇందులో ఆదివారం నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయించామని తెలిపారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, మార్క్‌ఫెడ్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 1.74 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలిపి మొత్తం 4.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఫిబ్రవరి నెలకు కేంద్రం నుంచి రావాల్సిన 2.95 లక్షల టన్నుల ఎరువులు కేటాయింపులు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం 49,736 మెట్రిక్ టన్నుల యూరియా జనవరి నెల సరఫరాలో లోటు కింద కేటాయించిందని చెప్పారు. ఫిబ్రవరి నెలకు మరో 20,500 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. వీటిని తూర్పు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో తూర్పు గోదావరికి 17,230 మెట్రిక్ టన్నులు, పశ్చిమ గోదావరికి 18వేల మెట్రిక్ టన్నులు, ఉత్తర కోస్తా జిల్లాలకు 14 వేల మెట్రిక్ టన్నులు, గుంటూరుకు 19,250 మెట్రిక్ టన్నులు, నెల్లూరు జిల్లాకు 12,800 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నామని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి రైతు భరోసా కేంద్రాల వ్యవస్ధ ద్వారా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత వచ్చిందని కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అక్రమ నిల్వలు, అధిక రేట్లపై వ్యవసాయ శాఖ సిబ్బంది నిరంతరం దుకాణాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా డీలర్లు అక్రమంగా ఎరువుల నిల్వ ఉంచినా, అధిక ధరలకు అమ్మినా టోల్ ఫ్రీ నంబర్ 155251కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఈ నెల 15న రైతుల ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారన్నారు. -
వెంటనే ఎరువులివ్వండి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయకు వ్యవసాయమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబర్ లో కేంద్రానికి తాను లేఖ రాశానని చెప్పారు. అక్టోబర్, నవంబర్‌కు 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకుగాను, 3.67 లక్షల మెట్రిక్ టన్నులే కేంద్రం కేటాయించిందన్నారు. అందులోనూ ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులే కేంద్రం సరఫరా చేసిందని తెలిపారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఓడల నుంచి ఎరువులను కేటాయించాలని నిరంజన్‌రెడ్డి కోరారు. గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ నౌక నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ, విశాఖ పోర్టుల్లో ఆర్సీఎఫ్, చంబల్, ఐపీఎల్ ఫెర్టిలైజర్స్‌కు చెందిన ఓడల నుంచి 30వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలన్నారు. అలాగే క్రిబ్కో కంపెనీ నుంచి 2 అదనపు రేక్‌ల యూరియా కేటా యించాలని కోరారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి సరఫరాలో పెంచి భర్తీ చేయాలన్నారు. -
సమతుల ఎరువులపై చైతన్యం
సాక్షి, అమరావతి: సమతుల ఎరువుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఏ సమయానికి ఏ ఎరువు వాడాలి.. ఎంత మోతాదులో వాడాలి.. తదితర విషయాలపై వారిని చైతన్యవంతుల్నిచేస్తోంది. డీఏపీ ఎరువుతో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల్లో పంటకు కావాల్సిన పోషకాల లభ్యత ఎక్కువగా ఉండటంతో పాటు.. చీడపీడల ఉధృతిని అరికట్టడంలో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పెరుగుదల దశలో భాస్వరం కంటే.. నత్రజని, పొటాష్ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. డీఏపీలో నత్రజని, భాస్వరం మాత్రమే లభ్యమవుతుండగా, కాంప్లెక్స్ ఎరువుల్లో నత్రజని, భాస్వరంతో పాటుగా పొటాష్, గంధకం వంటి ఇతర పోషకాలు అదనంగా లభిస్తున్నాయి. వీటితో పంట నాణ్యతతో పాటు దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయని వ్యవసాయాధికారులు ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నారు. దిగుబడుల్లో ఏ మాత్రం తేడా ఉండదు.. ► సాధారణంగా రైతులు పంటకు మొట్ట మొదటిసారి డీఏపీ వేస్తే.. పంట ఎదుగుదల, దిగుబడుల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తారు. అయితే మొదటి సారి డీఏపీ వేసినా, పోషకాలను ఇతర కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందించినా పంట ఎదుగుదల, దిగుబడుల్లో ఏ మాత్రం తేడా ఉండదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ► రైతులు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా.. విత్తిన/నాటిన నెల తర్వాత వేస్తే ఉపయోగం ఉండదంటున్నారు. వేర్ల్ల పెరుగుదలకు భాస్వరం అవసరం కనుక దీనిని ఆఖరు దుక్కిలో, దమ్ములోనే వేయాలని, లేకుంటే విత్తిన/నాటినప్పటి నుంచి 10–15 రోజులకు వేయాలని సూచిస్తున్నారు. ► మొక్కల పెరుగుదలలో కీలకమైన నత్రజనిని.. పంటను బట్టి 2 నుంచి 4 సార్లు వేయాల్సి ఉంటుందని, మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచి గింజలు/కాయలు బరువు పెరగడానికి పొటాష్ తోడ్పడుతుందని చెబుతున్నారు. ► సార్వాలో పండించే వరి, పత్తి, మిరప, దాళ్వాలో పండించే వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలకు సిఫార్సు చేసిన పోషకాలను వివిధ రకాల ఎరువుల ద్వారా మోతాదు మేరకు అందించాలని సూచిస్తున్నారు. ► అక్టోబర్ నెలకు 1.77 లక్షల టన్నుల యూరియా, 44 వేల టన్నుల డీఏపీ, 28 వేల టన్నుల ఎంవోపీ, 19 వేల టన్నుల ఎస్వోపీ, 2.06 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని, అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఎరువుల నిల్వలపై దుష్ప్రచారం తగదు రాష్ట్రంలో ఎరువుల కొరత ఉన్నట్టుగా దుష్ప్రచారం చేయడం తగదు. ప్రస్తుత అవసరాలకు సరిపడా 6.88 లక్షల టన్నుల నిల్వలున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల వాడకం ద్వారా మొక్కలకు సమతుల పోషకాలు అందించొచ్చు. సిఫార్సు చేసిన మేరకు వాటిని వినియోగించాలని ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్‌ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
అన్నదాతల ఆందోళన.. ఫర్నీచర్ ధ్వంసం
రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. అయితే సకాలంలో డిమాండ్‌కు సరిపడా ఎరువులను రైతులకు సరఫరా చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దీంతో ఎరువుల కోసం నవరంగపూర్, రాయగడ జిల్లాల రైతులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. రాయగడ జిల్లా కొలనార సమితిలోని బొడిఖిల్లాపొదోరొ, తెరువలి, ఖెదాపడ, డుమురిగుడ, కార్తీకగుడ, కిల్లగుడ, గడ్డి శెశిఖల్, దొందులి పంచాయతీలకు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. చదవండి: మైనర్ బాలిక కిడ్నాప్.. నోటిలో గుడ్డలు కుక్కి .. వ్యవసాయం పనులు ప్రారంభించామని, సకాలంలో రావాల్సిన ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మరో వారంలో అందకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై స్పందించాలని కోరుతూ కలెక్టర్ సరోజ్‌కుమార్ మిశ్రాకు వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేకపోవంతో ఏడీఎంఓ సోమనాథ్ ప్రధాన్‌కు దాఖలు చేశౠరు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి దుస్సాసన్ ప్రహరాజ్ను రైతులంతా చుట్టుముట్టారు. దీనిపై స్పందించిన ఆయన... ఎరువుల కొరత ఉన్న ప్రాంతాలకు వారం రోజుల్లో సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల కోసం ఏకరవు.. జయపురం: నవరంగపూర్ జిల్లా ఝోరిగాం గొడౌన్‌కు యూరియా చేరిందని తెలియగానే వందలాది మంది రైతులు పోటెత్తారు. సుమారు 2వేల మంది అక్కడికి చేరుకోగా.. ప్రతి ఒక్కరికీ రెండు బస్తాల చెప్పున ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. అయితే కేవలం 1600 బస్తాలు మాత్రం అందుబాటులో ఉండటంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భగ్గుమన్న రైతులు.. గోదాంను చుట్టుముట్టారు. కార్యలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఉమ్మరకోట్ ఎస్డీపీఓ దినేష్ చంద్రానాయక్, ఎస్ఐ నట్వర నందొ, ఝోరిగాం సమితి వ్యవసాయశాఖ అధికారి సునీత సింగ్, తహసీల్దార్ హృషికేష్ గోండ్ ఘటనా స్థలానికి చేరుకొని, రైతులకు నచ్చచెప్పారు. చివరకు ఒక్కో బస్తా చెప్పున అందించడంతో వారంతా శాంతించారు. చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ! -
రైతు వేషం లో విజయవాడ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
-
తీరనున్న ఎరువుల కొరత
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది. తగ్గనున్న దిగుమతి భారం దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్ఎఫ్సీఎల్ (అప్పటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్‌పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్‌లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఏర్పడింది ఇలా.. ►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్‌సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేసింది. ►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. నాడు బొగ్గు.. నేడు సహజవాయువు రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్‌కు వెళ్లే గ్యాస్ పైప్‌లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి 50 శాతం యూరియూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు. -
ఏపీ ఆర్బీకేలు ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని పారదర్శకంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుల ముంగిటకు సాగు ఉత్పాదకాలను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకేల పనితీరును ప్రత్యేకంగా అభినందించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర వ్యవసాయ శాఖ ఫెర్టిలైజర్ విభాగం డైరెక్టర్ జతిన్ చోప్రా ప్రశంసించారు. ఖరీఫ్‌లో ఎరువుల కేటాయింపు, పంపిణీపై అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని ఎరువుల పంపిణీని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మిగిలిన రాష్ట్రాలకు సూచించారు. అవసరమైతే ఈ విధానంపై యుద్ధప్రాతిపదికన అధ్యయనం చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీలో తీసుకొచ్చిన సంస్కరణలపై ఇతర రాష్ట్రాలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఓ నోడల్ అధికారిని నియమించాలని ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సూచించారు.రాష్ట్రాల వారీగా ఎరువుల నిల్వలు, పంపిణీ తీరుతెన్నులపై ఆయన ఆరా తీశారు. ఆర్బీకేల్లో 1.10లక్షల టన్నుల నిల్వలు.. సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల్లో 1.10లక్షల టన్నుల ఎరువుల నిల్వలను అందు బాటులో ఉంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ జతిన్ చోప్రాకు వివరించారు. దీంతో రైతులు ఎమ్మార్పీ ధరలకే గ్రామాల్లో ఎరువులు పొందేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. ఏ ఒక్క డీలర్.. ఎమ్మార్పీకి మించి అమ్మకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎరువుల నాణ్యత, లభ్యతను పరిశీలించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసామని వివరించారు. కాగా, జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి కేటాయించిన 1.56లక్షల టన్నుల యూరియా, 63వేల టన్నుల డీఏపీ, 1.20లక్షల టన్నుల కాంప్లెక్స్, 26వేల టన్నుల ఎంవోపీ ఎరువులు ఇంకా చేరలేదని కమిషనర్ వివరించగా, ఆగస్టులో వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని జతిన్‌చోప్రా హామీ ఇచ్చారు. -
AP: ఖరీఫ్‌కు పుష్కలంగా ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ పంటల సాగుకు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. రాష్ట్రంలో 6.66 లక్షల టన్నులు ఎరువుల నిల్వలు ఉన్నాయన్నారు. జూలై నాటికి మరో 6.86 లక్షల టన్నులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 4.30 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా.. ఇంకా 8.87లక్షల టన్నుల ఎరువులు, 0.23 లక్షల టన్నుల అమ్మోనియం, సల్ఫేట్ నిల్వలు ఉన్నాయని వివరించారు. జూలై నెలకు సంబంధించి రాష్ట్రానికి మరో 1.56 లక్షల టన్నుల యూరియా, 0.63 లక్షల టన్నుల డీఏపీ, 1.20 లక్షల టన్నుల కాంప్లెక్స్, 0.26 లక్షల టన్నుల ఎంవోపీ కేటాయించారని తెలిపారు. వాటిని రాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1.53 లక్షల టన్నుల ఎరువులను మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వ చేశామని, ఆర్బీకేల్లో 82 వేల టన్నులు రైతులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి.. రాష్ట్రానికి, జిల్లాలకు రావాల్సిన ఎరువులను రప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. డీలర్లు ఎవరైనా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే స్థానిక వ్యవసాయాధికారికి గాని, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 155251కు గాని ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. -
ఏపీ: ఎరువుకు రాదు కరువు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సాగువేళ రైతు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెలలో వైఎస్సార్ రైతుభరోసా మొదటి విడత సొమ్ము, వైఎస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము దాదాపు రూ.6,230 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈనెల 13న వైఎస్సార్ రైతుభరోసా కింద 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,230 కోట్లను ప్రభుత్వం జమచేయనుంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా – 2020 ఖరీఫ్‌కు సంబంధించి 38 లక్షల మంది రైతులకు ఈనెల 25న సుమారు రూ.2 వేల కోట్లు సొమ్ము ఇవ్వనుంది. సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు సబ్సిడీ విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్ సాగులో ఎంతో కీలకమైన ఎరువులకు కొరత లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. గతంలో సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా.. అదును దాటకముందు ఎరువులు అందుతాయో లేదో అనే ఆందోళనతో అన్నదాతలు కొట్టుమిట్టాడేవారు. కానీ ప్రస్తుతం సీజన్‌కు ముందే స్థానికంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కావాల్సిన ఎరువులను క్షేత్రస్థాయిలో నిల్వ చేస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 20.20 లక్షల టన్నుల కేటాయింపు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 92.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 21.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం 20.20 లక్షల ఎంటీలు కేటాయించింది. వీటిని నెలవారీ డిమాండ్‌కు అనుగుణంగా ఆయా కంపెనీల ద్వారా కేటాయించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 1.50 లక్షల టన్నుల ఎరువుల కొనుగోలుకు.. ఎరువుల పంపిణీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.75 కోట్లు విడుదల చేసింది. ముందస్తుగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను నాలుగంచెల çపద్ధతిలో క్షేత్రస్థాయిలో నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయిలో ఒక్కో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వద్ద కనీసం 5 టన్నులు నిల్వచేస్తారు. ఇందుకోసం ఏపీ మార్క్‌ఫెడ్ వద్ద 40 వేల టన్నులు సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు)/జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల్లో కనీసం 40 వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేయనున్నారు. ఇక సబ్ డివిజన్ స్థాయిలో ఆర్బీకే హబ్‌లలో 20 వేల టన్నులు నిల్వచేస్తారు. జిల్లాస్థాయి మార్క్‌ఫెడ్ గొడౌన్లలో 50 వేల టన్నులు, రిటైలర్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 5 లక్షల టన్నులు, కంపెనీ గోదాముల్లో 1.50 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్బీకేల వద్ద గ్రామస్థాయిలో ఖరీఫ్ కోసం కనీసం 2 లక్షల టన్నులు (యూరయా 85 వేల టన్నులు, డీఏపీ 28 వేల టన్నులు, ఎంవోపీ 9 వేల టన్నులు, కాంప్లెక్స్ 78 వేల టన్నులు) ఉంచాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్లకు నిర్దేశించారు. అవసరమైనచోట ఆర్బీకేల ద్వారా ఎక్కువ పరిమాణంలో రైతులకు ఎరువులను అందించేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో గోడౌన్లలో ముందస్తుగా నిల్వచేసే ఎరువుల నమూనాలను ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని జేడీలకు ఆదేశాలిచ్చారు. చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా చరిత్రలో తొలిసారి ఖరీఫ్ సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువులను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నాం. మార్కెట్ ధరల కంటే తక్కువకే లభ్యం కానున్నాయి. బహిరంగ మార్కెట్లో కృత్రిమ ఎరువుల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
కేంద్రమంత్రి సదానంద గౌడతో కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఎరువుల సరఫరాపై కింది అంశాలను వెల్లడించారు. • 2020 ఖరీఫ్ సీజన్ మొత్తానికి గానూ తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అని ప్రతిపాదనలు అందాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు.. 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఎరువుల విభాగం 10.17 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచింది. (4.01 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో కలుపుకుని) • ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 8.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరగింది. గతేడాది ఇదే సీజన్లో 5.09 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అమ్ముడైంది. ఈ సీజన్లో యూరియాకు ఊహించని విధంగా అధిక డిమాండ్ ఏర్పటినప్పటికీ.. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. • దీంతోపాటుగా ఆగస్టు, 2020 కోసం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉండగా.ఎరువుల విభాగం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తాన్ని (2.67 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో సహా) అందుబాటులో ఉంచింది. దిగుమతి చేసుకున్న యూరియా 2020 సెప్టెంబర్ నెల మధ్యనాటికి తెలంగాణకు సమీపంలోని ఓడరేవులను ఇవి చేరుకోవచ్చని భావిస్తున్నాము. కేంద్ర ఎరువుల విభాగం తెలంగాణ రాష్ట్ర ఎరువుల అవసరాలను నిశితంగా పరిశీలిస్తుందని, క్షేత్ర స్థాయి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా నిల్వలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తామని మంత్రి సదానంద గౌడ కిషన్ రెడ్డికి ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు. -
సాగు పెరిగింది.. ఎరువుల కోటా పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఎరువుల కోటా కూడా పెంచాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు కేటాయించిన యూరియా కోటాను వెంటనే పంపించాలని విన్నవించారు. ‘తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సానుకూల విధానాలు, కలిసొచ్చిన వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో ఈసారి గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగింది. కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగైంది. మరో 8.5 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉండగా, ఇంకో ఆరేడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. మొత్తంగా ఈ వానాకాలంలో దాదాపు కోటీ 41 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల వాడకం కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే సమయానికి 3.5 లక్షల టన్నుల యూరియా వాడితే, ఈ ఏడాది ఇప్పటి వరకు 7 లక్షల టన్నుల యూరియా వినియోగమైంది’అని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాగునీటి వనరుల రాకతో గతంతో పోలిస్తే ఆరేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు 10.5 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. ఈ నెల కోటా కింద రెండున్నర లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 80 వేల టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, మిగిలిన మొత్తాన్ని వెంటనే పంపించాలని కోరారు. మంత్రి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉన్నారు.