ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి | How To Make Easy And Organic Fertilizers To Grow Plants | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి

Published Wed, Nov 1 2023 11:48 AM | Last Updated on Wed, Nov 1 2023 12:01 PM

How To Make Easy And Organic Fertilizers To Grow Plants - Sakshi

హోమ్‌మేడ్‌ ఎరువు
గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం, స్పూను వంటసోడా వేసి కలపాలి. తరువాత అర టీస్పూను వెనిగర్‌ కూడా  కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. జీవం కోల్పోయిన మొక్కలపై ఈ ద్రావణాన్ని చిలకరిస్తే.. మొక్కలు పచ్చగా కళకళలాడతాయి.
► ఉల్లిపాయ ముక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. వెనిగర్‌ కలిపిన నీళ్లు, సోయాబీన్‌ నీళ్లు, బీరు కలిపిన నీళ్లు కూడా మొక్కలకు బలాన్ని అందించి చక్కగా పెరిగేలా చేస్తాయి.
► కప్పు వేడినీటిలో స్పూను పంచదార, స్పూను వంట సోడా, స్పూను వెనిగర్‌ వేసి కలపాలి. కప్పు మీద మూత పెట్టి ఉంచాలి. 48 గంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోస్తే వేళ్లకు బలం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement