తడి, పొడి చెత్తపై అవగాహన కలిగిస్తున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట: పట్టణాల్లో పెరుగుతోన్న చెత్త సమస్యను తీర్చేందుకు బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్లను సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్నారు. వ్యర్థం.. వేరుచేసి చూస్తే పర మార్థం ఉంటుందనే ఆలోచనతో సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ వినూ త్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ పట్టణాలుగా రూపొందిన బెంగళూరు, పుణే వంటి పట్టణాలకు సిద్దిపేట వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులను పంపించి ఆయా ప్రాంతాల్లో ఉన్న విధానాన్ని ఇక్కడ అమ లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛ సిద్దిపేట చేయాల నే ఆలోచనతో మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో బెంగళూరు తరహాలో సేంద్రియ ఎరువుల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ముందస్తుగా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై నాలుగు రోజులుగా హెచ్‌ఎస్‌ఆర్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శాంతితో కలసి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్తలు వేరు చేసేందుకు డబ్బాలు పంపిణీ చేశారు.
బెంగళూరు తరహాలో ప్లాంట్స్
బెంగళూరు వంటి పట్టణాల్లో పారిశుధ్య సమస్యను పరిష్కరించిన హెచ్‌ఎస్‌ఆర్ సామాజిక సేవా సంస్థ పనితీరును సిద్దిపేట జిల్లాలో అమలు చేయనున్నారు. బెంగళూరులోని హుజూర్ సర్జాపూర్ రోడ్డులోని 1.50 లక్షల మంది జనాభా ఉన్న కాలనీలో ఈ విధానంలో ఎక్కడి చెత్తను అక్కడే.. ఆయా కాలనీల్లోనే సేంద్రియ ఎరువులుగా మార్చడంలో హెచ్‌ఎస్‌ఆర్ సంస్థ సఫలీకృతమైంది. అలా తయారు చేసిన ఎరువును స్థానికంగా ఇళ్లలో, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు వేస్తారు. పొడిచెత్తను రీసైక్లింగ్‌కు పంపిస్తారు.
పరిశుభ్రమైన సిద్దిపేట లక్ష్యం
ప్రజల్లో అవగాహన లేక తడి, పొడి చెత్తను విచ్చలవిడిగా పారేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. తడి చెత్తతో బెంగళూరులో సేంద్రియ ఎరువులు తయారీ చేసిన విధానం బాగుంది. ఈ విధానం సిద్దిపేటలో అమలకు శ్రీకారం చుట్టామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment