మంత్రి హరీశ్‌రావుకు చెక్కును అందిస్తున్న దృశ్యం
గజ్వేల్: కరోనా నేపథ్యంలో మన సంస్కృతి గొప్పదనం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం గజ్వేల్‌లోని ఐవోసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి వేద బ్రాహ్మణులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి దేశంలో చేతులు జోడించి నమస్కారం చేసే పద్ధతి అమలులో ఉందని, అదే విధంగా ఆరోగ్య పరిరక్షణకు యోగాలో అనేక రకాలైన పద్ధతులు పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నామని తెలిపారు. కరోనా మున్నెన్నడూ లేని పరిస్థితులను సృష్టించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వేద బ్రాహ్మణులకు అండగా నిలవాలనే సంకల్పంతో నిత్యావసరాల పంపిణీకి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీపీజే ఫౌండేషన్, శ్రేయోభిలాషుల సహకారంతో జరిగిన కార్యక్రమంలో “గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లేశం, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌చైర్మన్ జకియొద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గజ్వేల్ మండలశాఖ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, “గడా’ ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి : మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు దృష్ట్యా ప్రభుత్వానికి చేయూతగా దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌కు చెందిన ఎన్నారైలు పంపించిన చెక్కును స్థానిక కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్, ఏలూరి సతీష్‌లు రూ. లక్ష చెక్కును మంత్రికి అందించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్, అంతటిగౌడ్, ప్రదాన కార్యదర్శి రంగుల సుధాకర్‌గౌడ్, ఫౌండర్ గంప వేణుగోపాల్, ప్రనీత్‌రెడ్డి, రంగు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్‌కు మరో స్ప్రే యంత్రం...
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన రూ.12 లక్షల విలువైన స్ప్రే మిషన్‌ను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అన్ని విధులల్లో స్ప్రే మిషన్‌తో పారిశుధ్యం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ సహాయ నిధికి విరాళాలు...
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి చేయూతగా నిలిచేందుకు టీహెచ్‌ఆర్ సేన చింతమడక గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని మంత్రి నివాసంలో రూ. 22,616లను మంత్రికి అందించారు.
మానవత్వం చాటుకున్న మహిళ..
అలాగే చింతమడక గ్రామానికి చెందిన చాకలి బాలవ్వ అనే మహిళ తన రజక వృత్తి నిర్వహించగా వచ్చిన రూ.3వేలను ప్రభుత్వానికి అందించి చేయూతగా నిలిచింది.
కరోనా కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యం
కొండపాక(గజ్వేల్): కరోనా వైరస్ కట్టడి ప్రజల సహకారంతోనే సాధ్యపడుతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల పరిదిలోని వెలికట్ట గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న 200 మంది వలస కూలీలకు, గ్రామ ఆటో డ్రైవర్లకు అమరనాథ్ నిత్యాన్నధాన సేవా సమితీ ఆధ్వర్యంలోమంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందిని శ్రీనివాస్, రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్, మండల కన్వీనర్ రాగల్ల దుర్గయ్య, అమరనాథ్ సేవా సమితి ప్రతినిధులు చీకోటి మధుసూదన్, కాశీనాథ్, నందిని శ్రీనివాస్, అయిత కరుణాకర్, అనిల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment