రాఘవా లారెన్స్
పదిహేనేళ్ల క్రితం రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుని సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శక–నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ తెలిపారు. అయితే పార్ట్1లో రజనీ లక లక లక అంటే పార్ట్2లో లారెన్స్ లక లక లక అంటారన్నమాట. ‘‘రజనీకాంత్‌గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్ పేర్కొన్నారు.
మూడు కోట్లు విరాళం
మూడు కోట్ల రూపాయలను కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా ఇస్తున్నట్లు వెల్లడించారు లారెన్స్. ఈ మూడు కోట్ల రూపాయల్లో యాభై లక్షలను పీఎమ్ కేర్స్ ఫండ్‌కు, యాభై లక్షలను తమిళనాడు ముఖ్య మంత్రి సహాయనిధికి, ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా)కు యాభై లక్షలను విరాళంగా ప్రకటించారు లారెన్స్. ఇంకా డ్యాన్సర్స్ యూనియన్‌కు 50లక్షలు, దివ్యాంగులకు పాతిక లక్షలు, తన స్వస్థలమైన రాయపురం దేశియానగర్‌లోని ప్రజలకు, దినసరి కార్మికులకు 75 లక్షలను విరాళంగా ఇవ్వబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment