
రికార్డు స్థాయిలో వేదాంత లాభం
కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ఇప్పటివరకూ ఏ త్రైమాసికంలోనూ ఆర్జించనంత భారీ నికరలాభాన్ని తాజాగా ముగిసిన
న్యూఢిల్లీ: కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ఇప్పటివరకూ ఏ త్రైమాసికంలోనూ ఆర్జించనంత భారీ నికరలాభాన్ని తాజాగా ముగిసిన మార్చి త్రైమాసికంలో సాధించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 3.4 రెట్లు పెరిగి రూ. 2,971 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికరలాభం రూ. 861 కోట్లు. కంపెనీ టర్నోవర్ 41% వృద్ధిచెంది రూ. 15,828 కోట్ల నుంచి రూ. 22,371 కోట్లకు పెరిగింది. అధిక పరిమాణంలో జింక్ విక్రయాలు, అల్యూమినియం ఉత్పత్తి పెంపుతో పాటు లోహాలు, చమురు ధరలు పెరగడంతో ఈ ఫలితాలు సాధ్యపడినట్లు కంపెనీ ఒక పకటన పేర్కొంది. కెయిర్న్ ఇండియా విలీనంతో అతిపెద్ద సహజవనరుల కంపెనీగా ఆవిర్భవించినట్లు వేదాంత చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు.