సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభం రూ.26 కోట్లు
లాభం రూ.26 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్‌స్టాంట్ కాఫీ తయారీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.213 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.241 కోట్ల టర్నోవర్‌పై రూ.26 కోట్ల నికర లాభం పొందింది. డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో రూ.668 కోట్ల టర్నోవర్‌పై రూ.85 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2013-14, 2014-15కుగాను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ ఇన్‌స్టాంట్ కాఫీతోపాటు యూఎస్‌ఏ, కెనడా, రష్యా, సీఐఎస్, తూర్పు దేశాలకు ఉత్తమ ఎగుమతిదారుగా అవార్డులను అందుకున్నట్టు సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.