హెచ్డీఎఫ్సీ లాభం 3,460 కోట్లు | HDFC Q4 net rises 40% at Rs 2607 cr driven by investments sales | Sakshi
Sakshi News home page

హెచ్డీఎఫ్సీ లాభం 3,460 కోట్లు

Published Tue, May 3 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

హెచ్డీఎఫ్సీ లాభం 3,460 కోట్లు

హెచ్డీఎఫ్సీ లాభం 3,460 కోట్లు

ఒక్కో షేర్‌కు రూ.14 డివిడెండ్
న్యూఢిల్లీ: గృహరుణాలిచ్చే ఆర్థిక సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.3,460 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో ఆర్జించిన నికర లాభం(రూ.2,646 కోట్లు)తో పోల్చితే 31 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.  మొత్తం ఆదాయం 14,737 కోట్ల నుంచి 17,027 కోట్లకు పెరిగిందని పేర్కొంది.   ఒక్కో షేర్‌కు రూ.14 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.

గతంలోని రూ.3 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొంది.  కేటాయింపులు రూ.68 కోట్ల నుంచి రూ.545 కోట్లకు పెరిగాయని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 0.72 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గాయని, నికర వడ్డీ మార్జిన్ 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గిందని తెలిపింది. లోన్ బుక్ రూ.2.28 లక్షల కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.2.59 లోల కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇక స్టాండోలోన్ ప్రాతిపదికన 2014-15 క్యూ4లో రూ.రూ.1,862 కోట్లుగా ఉన్న  నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 40 శాతం వృద్ధి చెంది  రూ.2,607 కోట్లకు పెరిగిందని వివరించింది.

 ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15 ఏడాదిలో రూ.8,763 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం వృద్ధితో రూ.10,190కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.48,390 కోట్ల నుంచి రూ.53,257కు పెరిగిందని తెలిపింది.  నికర వడ్డీ ఆదాయం రూ.2,355 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.2,469 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement