కామసూత్ర.. ఈ పేరు వినగానే వాత్సాయనుడి కామసూత్ర గుర్తుకు రాకమానదు. అయితే ఇకపై కామసూత్ర పేరు చెప్పగానే చక్కటి రుచులతో లొట్టలేసుకుంటూ తిన్న వంటలు గుర్తుకొస్తాయి. ఆ అదృష్టం ప్రస్తుతం శ్రీలంకవాసులకు దక్కింది. అసలు విషయానికొస్తే.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇందులో కొత్తేం ఉంది. స్టార్ స్టేటస్ ఉన్నవారు వ్యాపారాల్లోకి వస్తుండటం కామనే అనుకుంటున్నారా? ఇక్కడే ఓ విశేషం ఉంది. ఫెర్నాండెజ్ తన హోటల్కి పెట్టుకున్న ‘కామసూత్ర’ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ జన్మభూమిలోనే వ్యాపారం మొదలెట్టారు. శ్రీలంక టాప్ సెలబ్రిటీ షెఫ్ దర్శన్ మునిదిసతో కలిసి ఆమె హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘కామసూత్ర’ పేరుతో తన వ్యాపారం ప్రారంభించడం అటు శ్రీలంకలోనూ ఇటు బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అయింది. జనాలకు బాగా రీచ్ అవడానికి, పాపులారిటీ కోసమే జాక్వెలిన్ ఆ పేరు పెట్టారనే వారూ లేకపోలేదు. త్వరలో ఈ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో విస్తరించే ఆలోచనలో ఉన్న ఈ బ్యూటీ ఇండియాలోనూ ప్రారంభించాలనుకుంటున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment