
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో డీసెంట్ గాళ్‌గా రష్మిక మండన్నా నటించారు. ఇప్పుడు ఇదే పాత్రను చేయడానికి బాలీవుడ్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడీ అవుతున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ జైన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ సినిమా తెలుగులో ‘కిరాక్ పార్టీ’ టైటిల్‌తో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ‘డ్రైవ్’ సినిమాతో బిజీగా ఉన్నారు జాక్వెలిన్.
Comments
Please login to add a commentAdd a comment