జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే నటనతో పాటు ముక్కు ముఖం కూడా బావుండాలంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముక్కు విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో ‘నీ ముక్కు బాలేదు’ అని కొందరు ముక్కుసూటిగా చెప్పేవాళ్లట. 2009లో వచ్చిన ‘అలాదిన్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కి పరిచయమయ్యారు శ్రీలంక మూలాలున్న జాక్వెలిన్ ఫెర్నాండజ్. నటిగా బాలీవుడ్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘నటిగా బాలీవుడ్‌లో నా లక్ టెస్ట్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం శ్రీలంక నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఇండస్ట్రీలో నాకు తెలిసినవాళ్లు ఎవ్వరూ లేరు.
ఓ గుర్తింపు సంపాదించుకోవాలనే తపనతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాను. హీరోయిన్‌గా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు చాలా మంది నా పేరు మార్చుకోమని సలహా ఇచ్చేవాళ్లు. ఫెర్నాండజ్ ఏంటి? ముస్కాన్ అని పెట్టుకో బావుంటుంది అని ఒకరు, నీ ముక్కు బాలేదు, ముక్కు సర్జరీ చేయించుకో అని మరొకరు, ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దు అని కొందరు.. ఇలా రకరకాలుగా చాలా చెప్పేవారు. కానీ నేను మాత్రం నాలానే ఉండాలని నిశ్చయించుకున్నాను.. ఉన్నాను. ఈ పదేళ్ల ప్రయాణం నటిగా చాలా సంతృప్తినిచ్చింది. ఆ సలహాలు గుర్తు చేసుకున్నప్పుడల్లా నవ్వొస్తుంది’’ అని ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తుచేసుకున్నారు. అన్నట్లు.. ‘సాహో’లో ప్రభాస్‌తో కలిసి ‘బాడ్ బ్యాయ్..’ అనే పాటకు జాక్వెలిన్ స్టెప్పులేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment