బ్రాండెడ్‌ ఫెర్నాండెజ్‌! |  jacqueline fernandez fashion show | Sakshi
Sakshi News home page

బ్రాండెడ్‌ ఫెర్నాండెజ్‌!

Published Fri, Apr 13 2018 12:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

 jacqueline fernandez fashion show - Sakshi

మే 23 నుంచి భారతీయ యువతరం కొత్తగా మెరవబోతోంది! కొత్త ఫ్యాషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ ‘జస్ట్‌–ఎఫ్‌’ ఆ రోజు నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉండబోతోంది! ఆ బ్రాండ్‌ ఓనర్‌ ఎవరో కాదు.. జాక్విలీన్‌ ఫెర్నాండెజ్‌! ‘యూత్‌’ అనగానే బాయ్స్‌ కూడా ఉంటారని అనుకోకండి. ఓన్లీ లేడీస్‌ కోసం జస్ట్‌–ఎఫ్‌ను తెస్తున్నారు జాక్వెలీన్‌. నాలుగు ‘ఎఫ్‌’లతో భారతీయ సంస్కృతిని కలవరపెడుతున్న ఈ శ్రీలంక సౌందర్యరాశి మొదట ‘ఫిల్మ్‌’ ఇండస్ట్రీతో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘ఫుడ్‌’. ఆ తర్వాత ఫ్యాషన్‌. ఇప్పుడు ఫిట్‌నెస్‌. ఇందుకోసం ఆమె ప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘మోజోస్టార్‌’ తో కలిసి రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ‘‘ఎంపిక చేసుకున్న బ్రాండెడ్‌ లోదుస్తులు సరిపడనప్పుడు మహిళా క్రీడాకారిణులు పడే అవస్థలను నేను అర్థం చేసుకోగలను.

అయితే జస్ట్‌–ఎఫ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే దుస్తులు మహిళల మనసులనే కాదు, దేహాలనూ హత్తుకుపోయేలా ఉంటాయి’’ అని జాక్వెలీన్‌ చెబుతున్నారు. అలాగని స్పోర్స్‌  ఉమన్‌ పర్సనాలిటీలకు మాత్రమే ఆమె తన జస్ట్‌–ఎఫ్‌ను తెస్తున్నారని చింతించే పని లేదు. అమ్మాయిలందరికీనట. అయితే జాక్వెలీన్‌ ఇక్కడితో ఆగిపోవడం లేదు. త్వరలోనే ముంబైలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు. ప్రారంభించడం అంటే రిబ్బన్‌ కట్‌ చెయ్యడం కాదు. తనే సొంతగా ఓపెన్‌ చెయ్యడం. ఇప్పటికే కొలంబోలో ఆమెకు ‘కామసూత్ర’ అనే సొంత ఫైన్‌–డైనింగ్‌ థీమ్‌ రెస్టారెంట్‌ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే, గత నెలలో విడుదలైన ‘బాఘీ 2’ చిత్రంలో ‘ఏక్‌ దో తీన్‌..’ రీమేక్‌ ఐటమ్‌ సాంగ్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జాక్వెలీన్‌ త్వరలో ‘రేస్‌ 3’ చిత్రంతో యూత్‌ని ఎట్రాక్ట్‌ చెయ్యబోతున్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement