కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. | Raja Naik Success Story From Footpath To Millionaire | Sakshi
Sakshi News home page

కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..

Published Sun, Oct 1 2023 6:47 PM | Last Updated on Sun, Oct 1 2023 7:14 PM

Raja Naik Success Story From Footpath To Millionaire - Sakshi

ప్రస్తుతం కుబేరులుగా.. సక్సెస్ పీపుల్స్‌గా చెప్పుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త 'రాజా నాయక్'. ఈయనెవరో, ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్ ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాడు. తండ్రికి సంపాదన లేదు, తల్లి బ్రతకడానికి చాలా కష్టపడింది. కష్టాలు భరించలేక 17 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాజా ముంబై చేరుకున్నాడు.

ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయం
ఉన్నత చదువు లేని కారణంగా ఎలాంటి ఉద్యోగం లభించలేదు. కానీ అతనికి.. అతనిమీద ఉన్న దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలని సంకల్పించుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో, డబ్బు కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించాడు.

జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. తన కృషి, అంకితభావం వల్ల ఫుట్‌పాత్‌లోని తన చిన్న దుకాణం బాగా నడిచే స్థాయికి చేరింది. వ్యాపార రంగంలో మరిన్ని అడుగులు వేయడానికి కంకణం కట్టుకున్న రాజా నాయక్ అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు.

కొత్త వ్యాపారాలు
ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, ఇది కాకుండా బాటిల్ డ్రింకింగ్ వాటర్ వెంచర్ జల బేవరేజెస్‌ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఈయన తన వ్యాపారాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు.

ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!

ప్రస్తుతం ఈయన రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన సమాజంలోని అణగారిన వర్గాల కోసం విద్యా సంస్థలను నడుపుతున్నాడు. ప్రస్తుతం రాజా నాయక్ కర్ణాటకలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement