వాషింగ్టన్ : కంటికి కనిపించిన కరోనా వైరస్..ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అమెరికాలో మూడింట రెండు వంతుల చిరు వ్యాపారులను మహమ్మారి ఆర్థికంగా కుదిపేసింది. ఇప్పటికే వైరస్ కారణంగా 31 శాతం చిరుద్యోగులకు పని లేకుండా పోయింది. మరో మూడు నెలలపాటు ఇలాగే కొనసాగితే వారి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఇటీవల ఫేస్‌బుక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. స్మాల్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌తో కలిసి అమెరికాలోని 86 వేల మంది చిరు వ్యాపారులపై ఫేస్‌బుక్ ఈ సర్వే నిర్వహించింది. దుకాణాలు మూతపడటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో తిరిగి దుకాణాలు తెరిచేందుకు అవసరమైన డబ్బు కూడా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం కొత్త వారిని విధుల్లో తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదని సర్వేలో తేలిందని ఫేస్‌బుక్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్ బర్గ్ వెల్లడించారు. ( భారీ డీల్ : ఫేస్‌బుక్ చేతికి ‘జిఫీ’ )
ఇక ఎక్కువమంది చిరు వ్యాపారులు తమ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లు రాకపోవడంతో స్టాక్ అలానే ఉండిపోయింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నట్లు ఓ దుకాణదారుడు వెల్లడించారు. అంతేకాకుండా హెయిర్ స్టైలిస్టులు వీడియా చాట్ ద్వారా ఇంటి నుంచే హెయిర్ కట్‌కి సంబంధించిన చిట్కాలను అందిస్తూ తమ సేవలకు పని కల్పిస్తున్నారు. వ్యాపారులు ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా కస్టమర్లతో కమ్యునికేట్ చేస్తున్నారు. దీంతో వారికి మరింత ప్రోత్సాహం అందివ్వడానికి ఫేస్‌బుక్ ప్రత్యేకంగా గిఫ్ట్ కార్డులు, ఫుడ్ డెలివరీ బటన్లు వంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. (తీవ్ర సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ: గోల్డ్‌మెన్ సంస్థ )
Comments
Please login to add a commentAdd a comment