
పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని చింతల్, ఇంద్రజిత్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందరు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు..ఇంద్రజిత్ నగర్‌కు చెందిన నాలా కేశవరావు(40), వనజ(36) భార్యాభర్తలు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతకముందు పిల్లలు నందిని(4), దీపక్(11)లకు విషమిచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డినట్టు తెలుస్తోంది.
తమ మృతికి సుబ్బారెడ్డి అనే వ్యక్తే కారణమని, ఆయన వల్ల తాము వ్యాపారంలో నష్టపోయామని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం కలకత్తా నుంచి నగరానికి వచ్చి చింతల్ లో స్థిరపడ్డారు. వారితో పాటు కేశవరావు తల్లి చంద్రమ్మ కూడా ఉంటోంది. అయితే ఆమెకు కళ్లు కనిపించవని రాత్రి ఏం జరిగిందో తెలియదని చెబుతోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.