అనుమానమే ఉరికంబమై..
అనుమానమే ఉరికంబమై..
Published Thu, Aug 3 2017 12:32 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
► కుటుంబ కలహాలతో భార్యను నరికి భర్త ఆత్మహత్య
గుంటూరు(ఇబ్రహీంపట్నం): అనుబంధం, ఆత్మీయతలన్నీ ఆనందంగా ఉన్నంతవరకే.. ఒక్కసారి అనుమానమనే పెనుభూతం ప్రవేశిస్తే.. మానవత్వం కూడా మరిచి జతువులా ప్రవర్తిస్తారు. అయినవాళ్లను చేజేతులారా చంపుకుంటారు. అనుమానమనే అంధకారంలో ఓ భర్త విచక్షణ కోల్పొయి భార్యను గొడ్డలితో నరికాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త అర్థరాత్రి హత్యాయత్నం చేశాడు. భార్య మరణించిందనే అనుమానంతో అతను కూడా గ్రామం సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. ఈ ఘటన దాములూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్(50) క్లీనర్‌గా పనిచేస్తాడు. భార్య మస్తానీపై అనుమానంతో నిత్యం గొడవపడుతుండే వాడు. బుధవారం సాయంత్రం నుంచి ఇద్దరిమద్య గొడవ జరిగింది. కుమారుడు, కోడలు లోపల గదిలో నిద్రిస్తుండగా బయట వరండాలో నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో ముఖంపై నిర్థాక్షణ్యంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆమె రక్తపు మడుగులో పడి కేకలు వేసింది. లోపల గదిలో నిద్రిస్తున్న కుమారుడు, కోడులు వచ్చి గాయపడిన మస్తానీనీ చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇది గమనించని భర్త మస్తాన్ భార్య చనిపోయి ఉంటుందని భావించి గ్రామం సమీపంలోని కష్ణానది ఒడ్డున ఓచెట్టుకు ఉరేసుకుని మరణించాడు. మస్తానీ చికిత్స పొందుతున్న విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు భర్త శవాన్ని పోస్టుమార్టం కొరకు పోలీసులు తరలించారు. ఎస్‌ఐ కష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement