ఓడీ చెరువు: భార్య కాపురానికి రాలేదని అచ్చామియాపల్లికి చెందిన సద్దాంహుస్సేన్ (27) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన మేరకు.. సద్దాంహుస్సేన్, నజీనా దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని భర్త పలుమార్లు భార్య ఇంటికి వెళ్లి పిలిచినా ప్రయోజనం లేకపోయింది. మనస్తాపానికి గురైన సద్దాం హుస్సేన్ వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించగా పెద్దలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి చిన్నకుంట చెరువు కట్ట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసుకున్నారు.