భర్త ప్రవర్తన సరిగా లేదని..
Published Fri, Feb 17 2017 12:28 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
బనగానపల్లె రూరల్: భర్త ప్రవర్తన సరిగా లేదని యాగంటిపల్లె గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్యహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి మద్యానికి బానిసై భార్య లీలావతి(34)ని వేధించేవాడు. పలు మార్లు చెప్పినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో శరీరంపై కిరోసిన్ పోసు కొని నిప్పుంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందింది. మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాకేష్ గురువారం తెలిపారు.
Advertisement
Advertisement