వియోగం భరించలేమని దంపతుల ఆత్మహత్య | couple suicide for bereavement in chennai | Sakshi
Sakshi News home page

వియోగం భరించలేమని దంపతుల ఆత్మహత్య

Published Sat, Oct 29 2016 5:06 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

వియోగం భరించలేమని దంపతుల ఆత్మహత్య - Sakshi

వియోగం భరించలేమని దంపతుల ఆత్మహత్య

సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో భార్య చనిపోతుందని భర్త, సుమంగళిగా పోవాలని భార్య ఇలా ఒకరితర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని ఈరోడ్డు జిల్లాలో జరిగింది. ఈరోడ్డు జిల్లా చీనాపురం గంగరాజన్‌పుదురైకి చెందిన కుమారస్వామి (75), అమ్మనీ అమ్మాళ్ (67) దంపతులు. వీరి కుమారుడు  అమెరికాలో స్థిరపడ్డాడు. వృద్ధాప్యంతో అనారోగ్యం పాలైన అమ్మాళ్ ఇటీవల మంచానికే పరిమితమైంది. భార్య మరణాన్ని తట్టుకోలేనని భావించిన భర్త 26వ తేదీ రాత్రి విషం తాగాడు.

గమనించిన పొరుగు వారు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెల్సుకున్న అమ్మాళ్.. సుమంగళిగా చనిపోవాలని భావించి 27 రాత్రి బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది. సూసైడ్‌కు ప్రయత్నించి చికిత్స పొందుతున్న భర్త శుక్రవారం కన్నుమూశారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేక దంపతులిద్దరూ ప్రాణాలు తీసుకోవడం వారి బంధువులను తీరని విషాదాన్ని మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement